Jwala Gutta Birthday Special: గుత్తా జ్వాల లైఫ్‌లో ఇలాంటి ట్విస్ట్ బహుశా ఆమె కూడా ఊహించలేదేమో..!

ABN , First Publish Date - 2022-09-08T02:45:07+05:30 IST

పేరు, స్వభావం రెండూ ఒకేలా ఉంటే, దాన్ని ఇంగ్లీషులో aptronym (euonym) అంటారు; తెలుగులో సార్థకనామం అంటారేమో. గుత్తా జ్వాల(Gutta Jwala )ది కూడా aptronym అనొచ్చు. ఆమె క్రీడల

Jwala Gutta Birthday Special: గుత్తా జ్వాల లైఫ్‌లో ఇలాంటి ట్విస్ట్ బహుశా ఆమె కూడా ఊహించలేదేమో..!

పేరు, స్వభావం రెండూ ఒకేలా ఉంటే, దాన్ని ఇంగ్లీషులో aptronym (euonym) అంటారు; తెలుగులో సార్థకనామం అంటారేమో. గుత్తా జ్వాల(Gutta Jwala )ది కూడా aptronym అనొచ్చు. ఆమె క్రీడల విషయంలో ప్రతిభా జ్వాల, రూపానికి సౌందర్య జ్వాల, అధికార జులుంని వ్యతిరేకించడంలో ఆగ్రహ జ్వాల. ఈ రోజు (సెప్టెంబర్ 7)న పుట్టిన రోజు జరుపుకొంటున్న జ్వాల జీవిత విశేషాల మీద ఓ లుక్కేద్దామా..

ఇండియన్ బ్యాడ్మింటన్‌తో మిక్స్డ్ డబుల్స్ అంటే ముందుగా అందరికి గుర్తుకొచ్చే పేరు గుత్తా జ్వాల. బ్యాడ్మింటన్లోని అసమానతలపై గొంతెత్తి పోరాడుతుంది. కోచ్‌లందరు సింగిల్స్‌కే ప్రాధాన్యమిస్తున్నారని, డబుల్స్‌కు ప్రాధాన్యమివ్వడం లేదని అనేక సందర్భాల్లో తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో వర్ధమాన క్రీడాకారులను రూపొందించాలనే తపనతో కొత్తగా ఓ అకాడమీని ప్రారంభించింది. 


మొదట టెన్నిస్ బ్యాట్ పట్టి...

గుత్తా జ్వాల మహారాష్ట్రలో జన్మించింది. చైనీస్ తల్లి, ఇండియన్ (తెలుగు) తండ్రికి సెప్టెంబర్ 7, 1983న పుట్టింది. మొదట్లో ఆమె టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. కొంతకాలానికి బ్యాడ్మింటన్‌కు మారింది. చిన్న వయసు నుంచే ట్రైనింగ్ తీసుకోవడంతో ఈ క్రీడలో అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించింది. వివిధ కేటగీరీల్లో కలుపుకొని 316మ్యాచ్‌లు గెలిచింది. కెరీర్లో వరల్డ్ బెస్ట్ ర్యాంకు 6ను సాధించింది. అశ్విన్ని పొన్నప్పతో కలసి అనేక టోర్నీల్లో పాల్గొంది. ఈ జంట కామన్వెల్త్ గేమ్స్ 2010లో గోల్డ్, 2014లో సిల్వర్ పతకాలను గెలుచుకున్నారు. డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ కలుపుకొని జ్వాల 14 సార్లు నేషనల్ ఛాంపియన్‌గా నిలిచింది. బీడబ్ల్యూఎఫ్ గ్రాండ్‌ఫిక్స్ విన్నర్ టైటిల్‌ను ఆరు సార్లు గెలుచుకుంది. బ్యాడ్మింటన్‌కు ఆమె అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2011లో అర్జున అవార్డు పురస్కారంతో గౌరవించింది. తోటి ఆటగాడు చేతన్ ఆనంద్‌ (Chetan Anand)తో ప్రేమయాణాన్ని కొనసాగించింది. ఈ జంట 2005లో పెళ్లి చేసుకున్నారు. దాంపత్య జీవితంలో మనస్పర్థాలు రావడంతో 2011లో విడాకులు తీసుకున్నారు. 


రమ్మని పిలిచిన రంగుల లోకం... 

సినిమా ఇండస్ట్రీ నుంచి గత రెండు దశాబ్దాలుగా ఆమెకు హీరోయిన్ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ, తనకు బ్యాడ్మింటన్ అంటెనే ఇష్టం అని చెప్పి ఆ ఆఫర్స్‌ను తిరస్కరించింది. హీరో నితిన్ ఆమెకు మంచి స్నేహితుడు. తన సొంత చిత్రం ‘గుండె జారి గల్లంతయ్యిందే’ (Gunde Jaari Gallanthayyinde) లో హీరోయిన్ పాత్ర చేయాలని కోరాడు. అందుకు కూడా ఆమె నిరాకరించింది. చివరికి ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో తళుక్కుమంది. చేతన్‌తో విడాకులు తీసుకున్నాక అనుకోకుండా కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) పరిచమయ్యాడు. ఆలోచనలు, అభిరుచులు కలవడంతో కొంత కాలం డేటింగ్ చేశారు. అనంతరం గతేడాది ఏప్రిల్ 22న వివాహబంధంతో ఒక్కటయ్యారు. సినీరంగానికి నో చెప్పినా, సినీ హీరోని జీవిత భాగస్వామిగా స్వీకరించడం సినిమా పరిభాషలో చెప్పాలంటే చిత్రమైన ట్విస్ట్.



Updated Date - 2022-09-08T02:45:07+05:30 IST