సెట్‌లో ఇదే ఫస్ట్ టైమ్: ‘ఆర్ఆర్ఆర్’ ఐడీ కార్డ్‌తో యంగ్ టైగర్

ABN , First Publish Date - 2021-08-06T01:58:30+05:30 IST

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. టాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందుతోన్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఎటువంటి అంచనాలు నెలకొన్నాయో

సెట్‌లో ఇదే ఫస్ట్ టైమ్: ‘ఆర్ఆర్ఆర్’ ఐడీ కార్డ్‌తో యంగ్ టైగర్

‘‘నేను ఐడీ కార్డ్ ధరించి చాలా కాలం అవుతుంది. సెట్స్‌లో ఐడీ కార్డ్ వేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్’’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ఐడీ కార్డుతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రమ్ వేదికగా పోస్ట్ చేశారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. టాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందుతోన్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఎటువంటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవల్‌లో ఐదు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం 2021, అక్టోబర్ 13న విడుదలకానుంది.


కాగా, ఉక్రెయిన్‌లో జరుగుతున్న ఈ మూవీ సెట్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ఐడీ కార్డు వేసుకుని కనిపించారు. ఎన్టీఆరే కాదు.. పక్కనున్న రాజమౌళి కూడా ఐడీ కార్డు వేసుకున్నారు. ఈ ఐడీ కార్డుపై ‘నందమూరి తారక రామారావు-హీరో’ అని ఉంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరిదశలో ఉంది.





Updated Date - 2021-08-06T01:58:30+05:30 IST