హిందీలో జాన్‌ అబ్రహం... తెలుగులో గీతా ఆర్ట్స్‌!

ABN , First Publish Date - 2021-08-04T06:55:09+05:30 IST

మలయాళంలో ఈ ఏడాది వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో ‘నాయట్టు’ ఒకటి. చిన్న చిత్రమే అయినప్పటికీ... ప్రముఖుల ప్రశంసలు అందుకుంది...

హిందీలో జాన్‌ అబ్రహం... తెలుగులో గీతా ఆర్ట్స్‌!

మలయాళంలో ఈ ఏడాది వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో ‘నాయట్టు’ ఒకటి. చిన్న చిత్రమే అయినప్పటికీ... ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకులను మెప్పించింది. ఇప్పుడీ సినిమా కథ ఇతర భాషల ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ‘నాయట్టు’ హిందీ రీమేక్‌ హక్కులను హీరో జాన్‌ అబ్రహం సొంతం చేసుకున్నారు. బహుశా... ఆయనే నటించవచ్చు. ఆయన రీమేక్‌ రైట్స్‌ తీసుకున్న రెండో మలయాళ చిత్రమిది. ఇంతకు ముందు ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమైక్‌ రైట్స్‌ తీసుకున్నారు. ‘నాయట్టు’ తెలుగు రీమేక్‌ రైట్స్‌ను గీతా ఆర్ట్స్‌ సంస్థ సొంతం చేసుకుందని మలయాళ దర్శకుడు మార్టిన్‌ ప్రక్కాత్‌ తెలిపారు. తెలుగులో ఎవరితో రీమేక్‌ చేస్తారో చూడాలి.


Updated Date - 2021-08-04T06:55:09+05:30 IST