స్ర్కిప్ట్‌ సిద్ధమవుతోంది!

అనుష్క శర్మ టైటిల్‌ రోల్‌లో భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ జులన్‌ నిషిత్‌ గోస్వామి బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్టు సోనీ సంస్థ గతేడాది ప్రకటించింది. ఈ మధ్యలో ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి కదలికా లేకపోవడంతో దాన్ని పక్కనపెట్టారని భావించారు. అయితే ఈ చిత్రాన్ని పక్కనపెట్టలేదని బాలీవుడ్‌ సమాచారం. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ మీద వర్క్‌ చేస్తున్నారు. అది ఫైనలయ్యాక డైరెక్టర్‌, ఇతర తారాగణాన్ని ఎంపిక చేయనున్నారు. అనుష్క కూడా తన పాత్ర కోసం ముంద స్తుగా సిద్ధమయ్యాక ఈ ఏడాది ఆఖరులో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది. గతేడాది ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ జెర్సీ ధరించి అనుష్క శర్మ గోస్వామితో కలసి కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో కనిపించారు. అయితే ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్‌ , అనుష్క శర్మ ఓ బిడ్డకు జన్మనివ్వడంతో సినిమా చిత్రీకరణ అనుకున్న విధంగా ముందుకెళ్లలేదు. 2018లో వచ్చిన ‘జీరో’ అనుష్క శర్మ నటించిన చివరి చిత్రం.

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.