ఈ కాలం కథానాయికలు సినిమాల్లో అందాల ఆరబోతతోనే సరిపెట్టడం లేదు, హాట్‌హాట్ ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనలోనూ పోటీపడుతున్నారు. సెక్సీ ఫొటో షూట్స్‌తో అభిమానులను సర్ప్జైజ్ చేయడంలో జాన్వీకపూర్ తానెవరికీ తీసిపోనని ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్నారు. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే తేలిగ్గా కొట్టి పారేశారు. ప్రేక్షకులను ఆకట్టుకోవాలనో, సినిమా అవకాశాల కోసమో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పోస్ట్ చేయడం లేదన్నారు. నా దృష్టంతా ఎప్పుడూ నటనపైనే, అయితే ఫొటోషూట్ చేయడం కూడా నటనలో భాగంగానే భావిస్తానుఅని చెప్పుకొచ్చారు.
నా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను అభిమానులతో షేర్ చేసుకున్నట్టే నా ఫొటోలను పంచుకుంటాను తప్ప స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవాలనే తాపత్రయం నాకు లేదు. ఇక ఫొటోల్లో అసభ్యత అనేది చూసేవాళ్ల చూపుల్లో ఉంటుంది తప్ప మనం ధరించే దుస్తుల్లో ఉండదన్నారు. తనపై వచ్చే నెగిటివ్కామెంట్స్ను పెద్దగా పట్టించుకోనని జాన్వీకపూర్ పేర్కొన్నారు.