jeevitha Rajasekhar : గెలిచినా ఓడినా ఈ ఇండస్ట్రీ లోనే పని చేయాలి

ABN , First Publish Date - 2021-09-27T18:05:59+05:30 IST

అక్టోబర్ 10వ తేదీన మా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ప్రకాశ్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో నామినేషన్ ను దాఖలు చేశారు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ అనంతరం జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు ప్రకాశ్ రాజ్ గారి ప్యానెల్ అంతా నామినేషన్ వేశాం. సాధారణ ఎన్నిక లు లాగానే జరుగుతున్నాయి.

jeevitha Rajasekhar : గెలిచినా ఓడినా ఈ ఇండస్ట్రీ లోనే పని చేయాలి

అక్టోబర్ 10వ తేదీన మా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ప్రకాశ్ రాజ్ తన  ప్యానల్ సభ్యులతో నామినేషన్ ను దాఖలు చేశారు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ అనంతరం జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు ప్రకాశ్ రాజ్ గారి ప్యానెల్ అంతా నామినేషన్ వేశాం. సాధారణ ఎన్నిక లు లాగానే జరుగుతున్నాయి. ఏమి జరిగినా సినిమా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలి. చాలా హెల్డిగా ఈ ఎన్నికలు జరగాలి. ఆరోపణలు, ప్రత్యారోపణలు లేకుండా దిగ్నిఫైడ్ గా జరగాలి. కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి..మొన్న పృథ్వి ఆరోపణలు చాలా చిన్న పిల్లల వ్యవహారం లాగా అనిపించింది. ఆ వ్యాఖ్యలతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. నేను అసోసియేషన్ కి శక్తి వంచన లేకుండా చేశాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే తలెత్తుకు తిరిగేలా వుండాలి. మంచి వాతావరణం లో ఒకరిని ఒకరు కించ పరుచు కాకుండా ఎన్నికలు జరగాలి. అన్ని చోట్ల ఎలక్షన్స్ జరుగుతున్నట్టు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. మా ఎలక్షన్స్ ని భూతద్దం లో చూపించండి. ఎలక్షన్ అంటే ఎవరు ఏమి చేస్తారు అనేది చెప్పుకుంటాం. మేమందరం కాన్ఫిడెంట్ గా వున్నాం. ఇలా చేస్తాం, అలా చేస్తాం అని చెప్పటం లేదు. ప్రకాష్ రాజ్ అజెండాలో ఏమి చెప్పారో అవి చేసేందుకు పూర్తి స్పష్టత ఉంది. గెలిచినా ఓడినా ఈ ఇండస్ట్రీ లోనే పని చేయాలి. ఎన్నికలప్పుడు సహజంగా పోటీ వుంటుంది. విష్ణు మోహన్ బాబు సన్ అవ్వడం వల్ల మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి లాగా చూస్తున్నారు. చిరంజీవి గారు ఎక్కడ మాకు సపోర్ట్ అని చెప్పలేదు. చిరంజీవి అందరివాడు.ఇండస్ట్రీ వాళ్లకు చిరంజీవి ఆశీస్సులు వుంటాయి’. అని  అన్నారు. 

Updated Date - 2021-09-27T18:05:59+05:30 IST