Jayamma panchayithi : ఆకట్టుకుంటోన్న లిరికల్ సాంగ్

ABN , First Publish Date - 2022-01-16T21:24:32+05:30 IST

బుల్లి తెరపై క్రేజీ యాంకర్ గా, టాలీవుడ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్స్‌కు, ఆడియో ఫంక్షన్స్‌కు బెస్ట్ హోస్ట్ గా రాణిస్తున్నారు సుమ. మలయాళం మాతృభాష అయినప్పటికీ అచ్చ తెలుగులో ఆమె చేసే యాంకరింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. సందర్భానికి తగ్గట్టుగా ఆసువుగా ఆమె మాట్లాడే తీరు అబ్బుర పరుస్తుంది. అలాంటి సుమ తన కెరీర్ బిగినింగ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సినిమా అంతగా ఆడలేకపోవడంతో.. యాంకర్ గా స్థిరపడ్డారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన ఆమె.. ఇప్పుడో సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Jayamma panchayithi : ఆకట్టుకుంటోన్న లిరికల్ సాంగ్

మలయాళం మాతృభాష అయినప్పటికీ అచ్చ తెలుగులో సుమ చేసే హోస్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. సందర్భానికి తగ్గట్టుగా ఆసువుగా ఆమె మాట్లాడే తీరు అబ్బుర పరుస్తుంది. అలాంటి సుమ తన కెరీర్ బిగినింగ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సినిమా అంతగా ఆడలేకపోవడంతో.. యాంకర్ గా స్థిరపడ్డారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన ఆమె.. ఇప్పుడో సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సినిమా పేరు ‘జయమ్మ పంచాయితీ’. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగా ప్రకాశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి విజయ్ కుమార్ కలివరపు దర్శకుడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సుమ.. ఒక గ్రామానికి అండ, దండగా పంచాయితీలు తీర్చే పెద్దగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది . తాజాగా లిరికల్ టైటిల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఆ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 


కాసింత భోళాతనం.. కూసింత జాలిగుణం.. కాసింత గండ్రతనం.. కాసింత మొండితనం.. అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రచించగా.. శ్రీకృష్ణ ఆలపించారు.  ఈపాటతో జయమ్మ పాత్ర ధారి మనస్తత్వాన్ని కళ్ళకు కట్టారు. పల్లెటూరి మహిళగా ఆమె పలికించిన హావభావాలు ఈ పాటకే హైలైట్. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 



Updated Date - 2022-01-16T21:24:32+05:30 IST