‘జయమ్మ పంచాయితీ’ తీర్పు వచ్చేది అప్పుడే

ABN , First Publish Date - 2022-03-14T18:18:41+05:30 IST

ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాని కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు తెరకెక్కించాడు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశ్ ఈ సినిమాను నిర్మించారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. ఇందులో సుమ గ్రామంలోని సమస్యల్ని తీర్చే ఓ నాయకురాలిగా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొన్న ఈ సినిమాకి విడుదల తేదీని లాక్ చేశారు మేకర్స్. అందులో భాగంగా సుమ వాయిస్ తో కూడిన ఒక వీడియో ను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

ఆ వీడియోలో జయమ్మ  పాత్రధారి సుమ సినిమా విడుదల విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంది. చివరికి ఏప్రిల్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ సినిమా విడుదలైన వారానికి అంటే సరిగ్గా 29న  మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం విడుదల కానుంది.  ఆ డేట్ లో ఇతర సినిమాలేవీ రావడం లేదు. అయితే ‘జయమ్మ పంచాయితీ’ లాంటి చిన్న చిత్రాన్ని విడుదల చేయబోతుండడం విశేషమని చెప్పాలి. మరి ఏప్రిల్ 22న ‘జయమ్మ పంచాయితీ’ తీర్పు ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతోందో చూడాలి. 

Updated Date - 2022-03-14T18:18:41+05:30 IST