VIRAL VIDEO : జాక్విలిన్ తో ఉన్న ఆ ఇటాలియన్ అందగాడు ఎవరు?

ABN , First Publish Date - 2021-10-18T01:26:06+05:30 IST

బాలీవుడ్‌లో దూసుకుపోతోన్న శ్రీలంక సుందరి జాక్విలిన్ ఫెర్నాండెజ్. ఈ ‘సాహో’ బ్యూటీ ఇప్పుడు ఇంటర్నెట్ యూజర్స్‌ని తెగ ఆరాటపెడుతోంది. అఫ్‌కోర్స్, ఎప్పటిలా జాకీ తన అందాలతో అల్లరి చేసేస్తోంది. అంతే అయితే మామూలే...

VIRAL VIDEO : జాక్విలిన్ తో ఉన్న ఆ ఇటాలియన్ అందగాడు ఎవరు?

బాలీవుడ్‌లో దూసుకుపోతోన్న శ్రీలంక సుందరి జాక్విలిన్ ఫెర్నాండెజ్. ఈ ‘సాహో’ బ్యూటీ ఇప్పుడు ఇంటర్నెట్ యూజర్స్‌ని తెగ ఆరాటపెడుతోంది. అఫ్‌కోర్స్, ఎప్పటిలా జాకీ తన అందాలతో అల్లరి చేసేస్తోంది. అంతే అయితే మామూలే. కానీ, ఈ సారి ఓ సరికొత్త అందగాడితో జోడీ కట్టింది. అతనెవరు అన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చగా మారింది... 


జాక్విలిన్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉందట. అక్కడ ఆమె పాల్గొన్న ఓ వీడియో షూట్ నుంచీ కొంత భాగం నెట్‌లో వైరల్‌గా మారింది. సదరు వీడియోలో ఆమెతో పాటూ ఉన్నది ఓ ఇటాలియన్ యాక్టర్. పేరు... మైకెల్ మర్రోన్. ‘365 డేస్’ అనే సినిమాతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా పాప్యులర్ అయ్యాడు. అంతే కాదు, చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ఈ మైకెల్ పేరే మైమరిచి స్మరిస్తున్నారు. అటువంటి హార్ట్‌త్రోబ్‌తో హాట్ బ్యూటీ జాక్విలిన్, లక్కీ ఛాన్స్ కొట్టేసిందని, బీ-టౌన్ టాక్. వారిద్దరి ప్రాజెక్ట్ ప్రస్తుతం దుబాయ్‌లో షూట్ జరుపుకుంటోందట. అయితే, ఇంతకీ ఆ ప్రాజెక్ట్ మిగతా వివరాలు ఏంటి అన్నదే క్లారిటీ రావటం లేదు. సస్పెన్స్ కొనసాగుతోంది. చూడాలి మరి, ఇటాలియన్ అందగాడితో జాక్విలిన్ అందాల జాతర దేని కోసమో? 

Updated Date - 2021-10-18T01:26:06+05:30 IST