ఈ ప్రపంచంలోనే కూలెస్ట్ మేన్ ‘పుష్ప’ : జాన్వీ కపూర్

ABN , First Publish Date - 2022-01-10T16:17:54+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ ‘పుష్ప’. సినిమా విడుదలై ఇప్పటికి 23 రోజులైంది. ఆల్రెడీ ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయినప్పటికీ ‘పుష్ప’ ప్రకంపనలు ఇంకా తగ్గలేదు. విడుదలైన అన్ని భాషల్లోనూ అనూహ్యంగా వసూళ్ళ వర్షం కురిపించడంతో.. సినిమా విడుదల ప్రారంభంలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసిన వారు, నెగెటివ్ రివ్యూస్ ఇచ్చిన వారు నోరెళ్ళబెడుతున్నారు. ఇక ఈ సినిమాను థియేటర్స్ లో చూడడం కుదరని సెలబ్రిటీస్ ఇప్పుడు ఓటీటీలో చూసి అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ను, అతడి డెడికేషన్ ను ఆకాశానికెత్తేస్తున్నారు

ఈ ప్రపంచంలోనే కూలెస్ట్ మేన్ ‘పుష్ప’ : జాన్వీ కపూర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ ‘పుష్ప’. సినిమా విడుదలై ఇప్పటికి 23 రోజులైంది. ఆల్రెడీ ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయినప్పటికీ ‘పుష్ప’ ప్రకంపనలు ఇంకా తగ్గలేదు. విడుదలైన అన్ని భాషల్లోనూ అనూహ్యంగా వసూళ్ళ వర్షం కురిపించడంతో.. సినిమా విడుదల ప్రారంభంలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసిన వారు, నెగెటివ్ రివ్యూస్ ఇచ్చిన వారు నోరెళ్ళబెడుతున్నారు. ఇక ఈ సినిమాను థియేటర్స్ లో చూడడం కుదరని సెలబ్రిటీస్ ఇప్పుడు ఓటీటీలో చూసి అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ను, అతడి డెడికేషన్ ను ఆకాశానికెత్తేస్తున్నారు. పలువురు బాలీవుడ్ స్టార్స్ ‘పుష్ప’ సినిమాకి ఫిదా అవుతూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అలాంటి వారి లిస్ట్ లోకి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కూడా వచ్చి చేరింది. 


ఇటీవల ‘పుష్ప’ చిత్రాన్ని వీక్షించిన అందాల జాన్వీ కపూర్.. తన ఇన్ స్టా స్టోరీస్ లో పుష్ప చిత్రంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అల్లు అర్జున్ ‘పుష్ప’ మాస్ గెటప్ ను షేర్ చేస్తూ దానిపై ‘ది కూలెస్ట్ మేన్ ఇన్ ది వరల్డ్’ అని కేప్షన్ ఇచ్చేసింది జాన్వీ. ఫోటో కింద హ్యాష్ ట్యాగ్ లో ‘పుష్ప’ని మెన్షన్ చేసి.. మైండ్ బ్లోన్ అనే టెక్ట్స్ కూడా ఇచ్చింది.  ప్రస్తుతం జాన్వీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Updated Date - 2022-01-10T16:17:54+05:30 IST