కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన Janhvi Kapoor.. ఆ క్వాలిటీ మాత్రం కంపల్సరీ అంటూ..

ABN , First Publish Date - 2022-06-24T17:52:22+05:30 IST

బాలీవుడ్‌లో అత్యంత పాపులర్ స్టార్ కిడ్స్‌లో జాన్వీ కపూర్ ఒకరు. దివంగత అందాల తార శ్రీదేవి (Sridevi) వారసురాలిగా..

కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన Janhvi Kapoor.. ఆ క్వాలిటీ మాత్రం కంపల్సరీ అంటూ..

బాలీవుడ్‌లో అత్యంత పాపులర్ స్టార్ కిడ్స్‌లో జాన్వీ కపూర్ ఒకరు. దివంగత అందాల తార శ్రీదేవి (Sridevi) వారసురాలిగా ‘ధకడ్ (Dhadak)’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. అనంతరం చేసిన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ ‘ఘోస్ట్ స్టోరీస్’ వంటి చిత్రాలలో ఈ భామ నటిగా మరో మెట్టు ఎక్కింది. 25 ఏళ్ల జాన్వీ నటించిన తాజా చిత్రం ‘గుడ్‌లక్ జెర్రీ (GoodLuck Jerry)’. 


తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ మూవీ ‘కొలమావు కోకిల (తెలుగులో కో కో కోకిల)’కి ఇది అధికారిక రిమేక్. ఈ చిత్రానికి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూలై 29న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో చెప్పేసింది.




జాన్వీ మాట్లాడుతూ.. ‘అతను నిజంగా ప్రతిభావంతుడై ఉండి, అతను గోల్స్‌పై ఎంతో మక్కువ కలిగి ఉండాలి. అతనితో ఉన్నప్పుడు నాలో ఉత్సాహం రావాలి. అతని నుంచి ప్రతి రోజూ ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి. అలాగే సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా ముఖ్యం. అన్నింటి కన్నా ముఖ్యంగా.. నేనంటే పడి చచ్చిపోవాలి’ అని చెప్పుకొచ్చింది. కాగా.. జాన్వీ ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో ‘బావాల్’, రాజ్‌కుమార్ రావుతో ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, సన్నీ కౌశల్‌తో ‘మిలీ’, అలాగే మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు ఈ బ్యూటీ కిట్టిలో ఉన్నాయి.

Updated Date - 2022-06-24T17:52:22+05:30 IST