పెళ్లిపై జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2021-08-03T21:21:40+05:30 IST

పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరికీ రకరకాల ప్లాన్‌లు ఉంటాయి. అదే సినిమా తారల పెళ్లి అంటూ భారీ హంగామానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమకు చెందిన తారలంతా విదేశాల్లో డిస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు.

పెళ్లిపై జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు!

పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరికీ రకరకాల ప్లాన్‌లు ఉంటాయి. అదే సినిమా తారల పెళ్లి అంటూ భారీ హంగామానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమకు చెందిన తారలంతా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు. కానీ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్‌ మాత్రం తన పెళ్లి ఇక్కడే చేసుకుంటానంటోంది. కాబోయేవాడికి తెలివితేటలుంటే చాలని చెప్పింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మనసులో మాట బయటపెట్టింది. తన వెడ్డింగ్‌ డ్రీమ్‌ గురించి చెప్పుకొచ్చింది. ‘‘పెళ్లి పనులన్నీ రెండు మూడు రోజుల్లో  అయిపోవాలి. కాప్రి ఐల్యాండ్‌లో ఓ ప్రైవేట్‌ బోట్‌లో నా స్నేహితులతో కలిసి బ్యాచ్‌లర్‌ పార్టీ చేసుకున్నాక తిరుపతిలో నా పెళ్లి చేసుకుంటాను. మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలు చెన్నైలోని మైలాపూర్‌లో అమ్మ నివసించిన ఇంటిలోనే జరగాలి. పెళ్లికి దక్షిణాది సంప్రదాయ చీర ధరించాలనేది నా కోరిక’’ అని తెలిపింది. 


Updated Date - 2021-08-03T21:21:40+05:30 IST