‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి సోల్‌ అదే: రాజమౌళి

సోల్‌ మొత్తానికి సంగీత రూపమిస్తే... జనని: రాజమౌళి

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.  రాజమౌళి అండఖ టీమ్‌ ప్రమోషన్‌పై దృష్టి పెట్టింది. సినిమాకు సంబంధించి ఒక్కో విషయాన్ని బయటకు వదులుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 26న ‘జనని’ అనే పాటను విడుదల చేయనున్నారు. దేశభక్తి చాటేలా ఉండే ఈ పాటను గురువారం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ విలేకర్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించింది. రాజమౌళి, నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘జనని’ పాట సినిమాకు సోల్‌ అని రాజమౌళి చెప్పారు. ఆ పాట కోసం అన్నయ్య కీరవాణి రెండు నెలలపాటు శ్రమించారని తెలిపారు. సంగీతం అందించడమే కాకుండా ఈ పాటకు లిరిక్స్‌ కూడా ఆయనే అందించడం విశేషం. డిసెంబర్‌ మొదటివారంలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. వరుసగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్ర బృందంమంతా మీడియా ముందుకు వచ్చి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతామని రాజమౌళి తెలిపారు. 


‘జనని’ చాలా ప్రత్యేకం...

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌లో చాలా యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. ప్రతి సన్నివేశంలో గుండెను తాకే ఎమోషన్‌ డ్రైవ్‌  అవుతుంది. నాటు నాటు వటిఇ మాస్‌ సాంగ్‌లో కూడా అండర్‌లైన్‌గా ఓ ఎమోషన్‌ ఉంటుంది. లోతుకు వెళ్లేకొద్ది కంటికి కనిపించని కోర్‌ సాఫ్ట్‌ ఎమోషన్‌ తగులుతుంది. కానీ అన్నింటిని ముందుకు నడిపించేది ఆ చిన్న ఎమోషనే! అదే జనని. సినిమాకు సోల్‌ లాంటి పాట ఇది. సినిమా సోల్‌ మొత్తానికి సంగీత రూపమిస్తే... అదే జనని. చాలా సాఫ్ట్‌ మెలోడి’’ అని రాజమౌళి చెప్పారు. 



అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.