‘జైలర్’ రజనీకాంత్
ABN , First Publish Date - 2022-06-18T05:30:00+05:30 IST
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించే 169వ చిత్రానికి‘జైలర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించే 169వ చిత్రానికి‘జైలర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానరుపై నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకుడు. హీరోయిన్‌గా ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను అనుకుంటున్నారు. ఈ చిత్రం జూలైలో సెట్స్‌పైకి వెళ్ళనుంది.