ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘జైభీమ్, మరక్కార్’

ABN , First Publish Date - 2022-01-21T20:27:55+05:30 IST

ఆస్కార్ 2022 విదేశీ చిత్రం కేటగిరిలో రెండు భారతీయ చిత్రాలు నామినేట్ అవడం విశేషం. అందులో ఒకటి సూర్య హీరోగా నటించిన తమిళ చిత్రం ‘జైభీమ్’ అయితే, మరొకటి మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన చారిత్రక చిత్రం ‘మరక్కార్ : అరబిక్కడలిండే సింహం’. ఓటీటీలో విడుదలై టాప్ రేటింగ్ ను సొంతం చేసుకున్న సూర్య ‘జైభీమ్’ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇటీవల ఈ సినిమాలోని ఒక సన్నివేశాన్ని ఆస్కార్స్ యూ ట్యూబ్ ఛానల్ వారు ప్రసారానికి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘జైభీమ్, మరక్కార్’

ఆస్కార్ 2022 విదేశీ చిత్రం కేటగిరిలో రెండు భారతీయ చిత్రాలు నామినేట్ అవడం విశేషం. అందులో ఒకటి సూర్య హీరోగా నటించిన తమిళ చిత్రం ‘జైభీమ్’ అయితే, మరొకటి మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన చారిత్రక చిత్రం ‘మరక్కార్ : అరబిక్కడలిండే సింహం’. ఓటీటీలో విడుదలై టాప్ రేటింగ్ ను సొంతం చేసుకున్న సూర్య ‘జైభీమ్’ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇటీవల ఈ సినిమాలోని ఒక సన్నివేశాన్ని  ఆస్కార్స్ యూ ట్యూబ్ ఛానల్ వారు ప్రసారానికి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్ 2022 బెస్ట్ మూవీ కేటగిరికి నామినేట్ అయినట్టు..  అఫీషియల్ గా ప్రకటించారు. 


మోహన్ లాల్ నటించిన ‘మరక్కార్ : అరబిక్కడలిండే సింహం’ చిత్రం చారిత్రక కథాంశంతో తెరకెక్కింది. 16వ శతాబ్దంలో ఇండియన్ నేవీ ఆఫీసర్ గా పనిచేసిన కుంజాలీ మరక్కార్ జీవిత కథగా ఈ సినిమా రూపొందింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ‘మరక్కార్: అరేబియా సముద్ర సింహం’గా విడుదలైంది. పాన్ ఇండియా కేటగిరిలో బహుభాషల్లో విడుదలైన ఈసినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆస్కార్ కు నామినేట్ అవడం విశేషంగా మారింది. 



Updated Date - 2022-01-21T20:27:55+05:30 IST