ఆస్కార్ యూట్యూబ్ ఛానల్లో ‘జై భీం’ సినిమా

ABN , First Publish Date - 2022-01-19T00:05:40+05:30 IST

జై భీమ్ అనే సినిమా నిజ జీవితంలోని ఒక కేస్ స్టడీ ద్వారా రూపొందించిన చిత్రం. యాక్టివిస్ట్-లాయర్ చంద్రు, తన అవిశ్రాంత ప్రయత్నాల ద్వారా తమిళనాడులోని ఆదివాసీ తెగలకు న్యాయం చేసిన వ్యక్తి. కథ, కథనాన్ని ఎలా రూపొందించారని రచయిత-దర్శకుడు జ్ఞానవేల్ వివరించారు..

ఆస్కార్ యూట్యూబ్ ఛానల్లో ‘జై భీం’ సినిమా

చెన్నై: కొద్ది రోజుల క్రితం ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌‌లో విడుదలైన చిత్రం ‘జై భీం’. తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలో జ్ణానవేల్ దర్శకుడిగా జస్టిస్ చంద్రు అనే మాజీ జడ్జీ, లాయర్ నిజజీవితంలోని కొన్ని సంఘటనలు ప్రధానాంశంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల నుంచి అద్భుతమైన రీతిలో ప్రశంసలు సాధించింది. హీరో సూర్య కెరీర్‌లోనే కాకుండా భారత సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా ఓ మైలు రాయని విమర్శలు సైతం మెచ్చుకున్నారు. ఇండియాలో ఎన్నో రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం.. తాజాగా ఆస్కార్‌కు ఎక్కింది. అంటే, ఆస్కార్ అవార్డుల్లో ఈ సినిమాను ఇంకా ఎంపిక చేయలేదు కానీ, ఆస్కార్‌ యూట్యూబ్ ఛానల్లో ‘జై భీం’ చిత్రం గురించి చెప్పుకొచ్చారు.


ఇండియాలోని సామాజిక అసమానతల (కులం వివక్ష) స్వరూపాన్ని సినిమా ఓపెనింగ్ సీన్‌లోనే డైరెక్టర్ జ్ణానవేల్ అద్భుతంగా చూపించారు. జై భీం సినిమా గురించి వివరించే క్రమంలో ఆస్కార్ కూడా మొదటగా ఇదే సీన్‌ను చూపించింది. అనంతరం.. సినిమా గురించి డైరెక్టర్ జ్ణానవేల్ చెప్పిన విషయాలను (తమిళ్‌లో ఆయన చెప్పినదాన్ని ఇంగ్లీష్ సబ్-టైటిట్స్‌లో) చూపించారు. గిరిజన జీవిన విధానాన్ని చూపిస్తూనే.. పోలీస్ స్టేషన్‌లో వాళ్లపై జరిగిన అరాచక ఘటనలు, కోర్టులో జస్టిస్ చంద్రు వాదనలు చివరగా కోర్టు తీర్పుతో ముగించారు. ఇక జై భీం సినిమా గురించి వీడియో లింకులో ‘‘జై భీమ్ అనే సినిమా నిజ జీవితంలోని ఒక కేస్ స్టడీ ద్వారా రూపొందించిన చిత్రం. యాక్టివిస్ట్-లాయర్ చంద్రు, తన అవిశ్రాంత ప్రయత్నాల ద్వారా తమిళనాడులోని ఆదివాసీ తెగలకు న్యాయం చేసిన వ్యక్తి. కథ, కథనాన్ని ఎలా రూపొందించారని రచయిత-దర్శకుడు జ్ఞానవేల్ వివరించారు’’ అని రాసుకొచ్చారు.

Updated Date - 2022-01-19T00:05:40+05:30 IST