Suriya: ‘జై భీమ్’ సీక్వెల్ తప్పకుండా ఉంటుందన్న సహ నిర్మాత

ABN , First Publish Date - 2022-11-30T00:18:52+05:30 IST

విభిన్న పాత్రలు, ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సూర్య (Suriya). అతడు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘జై భీమ్’ (Jai Bhim). కోర్టు రూమ్ డ్రామాగా రూపొందింది

Suriya: ‘జై భీమ్’ సీక్వెల్ తప్పకుండా ఉంటుందన్న సహ నిర్మాత

విభిన్న పాత్రలు, ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సూర్య (Suriya). అతడు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘జై భీమ్’ (Jai Bhim). కోర్టు రూమ్ డ్రామాగా రూపొందింది. జస్టిస్ చంద్రు జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమాను రూపొందించారు. చంద్రు పాత్రను సూర్య పోషించాడు. లీజో మోల్ జోస్, మణికందన్ కీలక పాత్రలు పోషించారు. టీజే. జ్ఞానవేల్ (TJ. Gnanavel) దర్శకత్వం వహించాడు. కరోనా వల్ల ఈ చిత్రం నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమాకు సీక్వెల్  తప్పకుండా ఉంటుందని మేకర్స్ చెప్పారు. 


జై భీమ్‌ను గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘ఇండియన్ పనోరమా ఫీచర్ ఫిలిం ఫెస్టివల్ సెక్షన్‌’ లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫిలిం ఫెస్టివల్‌లో చిత్ర బృందం పాల్గొంది. సినిమా స్క్రీనింగ్ అనంతరం డైరెక్టర్, కో ప్రొడ్యూసర్ మీడియాతో ముచ్చటించారు. సీక్వెల్ ఆలోచన ఉందని సహ నిర్మాత రాజశేఖర్ పాండియన్ చెప్పాడు. ‘జై భీమ్ 2’ (Jai Bhim 2) తప్పకుండా ఉంటుందని తెలిపాడు. సినిమాలో చూపించిన విధంగా జస్టిస్ చంద్రు అనేక కేసులను పరిష్కరించారని పేర్కొన్నాడు. జై భీమ్‌లోకి సూర్య ఏవిధంగా వచ్చాడో కూడా వివరించాడు. ‘‘సినిమాను నిర్మించాలని సూర్యను కలిశాం. కానీ, కథ విన్నాక నేను సినిమాలో చేస్తానని సూర్య చెప్పాడు’’ అని రాజేశేఖర్ పాండియన్ పేర్కొన్నాడు. విల్లుపురంలో 1993లో ఇరులర్ తెగ ప్రజలకు వ్యతిరేకంగా జరిగిన ఒక రియల్ ఘటనను ఆధారంగా చేసుకుని జై భీమ్‌ను రూపొందించారు. అయితే, సూర్య, టీజే. జ్ఞానవేల్ కలసి ఓ సినిమా చేస్తామని గతంలోనే ప్రకటించారు. ఆ సినిమా ‘జై భీమ్ 2’ నా లేదా ఏదైనా కొత్త సినిమానా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.   



Updated Date - 2022-11-30T00:18:52+05:30 IST