Jaggu Bhai: ఇక థర్డ్ ఇన్నింగ్స్.. తట్టుకోలేరు!

ABN , First Publish Date - 2022-10-04T01:24:21+05:30 IST

విలక్షణ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇందులో ఆయన నా ‘ఫస్ట్ ఇన్నింగ్స్ చూశారు.. సెకండ్ ఇన్నింగ్స్..

Jaggu Bhai: ఇక థర్డ్ ఇన్నింగ్స్.. తట్టుకోలేరు!

విలక్షణ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇందులో ఆయన నా ‘ఫస్ట్ ఇన్నింగ్స్ చూశారు.. సెకండ్ ఇన్నింగ్స్ చూశారు.. థర్డ్ ఇన్నింగ్స్ చూడబోతున్నారు. మీ భీమ్ రావ్ దొర (Bheem Rao Dhora) ఫ్రమ్ రుద్రంగి మూవీ’ అంటూ ఓ పిక్‌ని పోస్ట్ చేశారు. ఈ పిక్‌లో ఆయన భీకరంగా, జాలి-దయ లేని కర్కోటకుడిగా కనిపిస్తున్నారు. ఈ ట్వీట్ ఇప్పుడందరినీ ఆకర్షిస్తోంది. జగపతిబాబు ఫస్ట్ ఇన్నింగ్స్ హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. మంచి మంచి హిట్స్ కూడా ఆయనకి ఉన్నాయి. ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ వస్తుండటంతో కొన్నాళ్లపాటు యాక్టింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేశారు. అందులో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూ.. క్షణం తీరికలేని బిజీ నటుడిగా మారిపోయారు. సెకండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతుండగానే డిక్లేర్ చేసి.. ఇప్పుడు ఫ్రెష్‌గా థర్డ్ ఇన్నింగ్స్ అంటూ జగ్గు భాయే స్వయంగా ప్రకటించడంతో.. ఈ ఇన్నింగ్స్‌లో ఆయన ఏ తరహా పాత్రలతో అలరించబోతున్నాడో అంటూ నెటిజన్లు సైతం మాట్లాడుకుంటున్నారు. దానికి జస్ట్ శాంపిల్ అన్నట్లుగా.. తాజాగా ఆయన చేస్తున్న చిత్రంలోని పాత్ర ఉంది. అంతకు ముందు మోషన్ పోస్టర్ విడుదల చేస్తూ.. ‘విలన్‌గా మరోసారి క్రూరమైన పాత్ర.. కానీ నా కెరీర్‌కు ఇది చాలా ప్లస్ అవుతుంది. ప్రేక్షకులు ఈ హింసాత్మక ఫ్యామిలీ డ్రామాని ఆదరిస్తారని ఎంతగానో ఆశిస్తున్నాను. ‘రుద్రంగి’ నాది’.. అంటూ ఆయన చేసిన ట్వీట్ కూడా ఈ సినిమాతో ఆయన అడుగు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తుంది.


ఇక ‘రుద్రంగి’ సినిమా విషయానికి వస్తే.. ఎం.ఎల్.ఏ, కవి, గాయకుడు, రాజకీయ వేత్త  రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan).. తన రసమయి ఫిలిమ్స్ బ్యానర్‌లో భారీ స్థాయిలో నిర్మిస్తోన్న చిత్రం ‘రుద్రంగి’ (Rudrangi). ఈ సినిమాలో జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహన్‌దాస్, కాలకేయ ప్రభాకర్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ‘బాహుబలి (Bahubali), ఆర్.ఆర్.ఆర్ (RRR)’ చిత్రాలకు రైటర్‌గా పని చేసిన అజయ్ సామ్రాట్ (Ajay Samrat) ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా ఈ చిత్రంలోని జగపతిబాబు పాత్రకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. భీమ్ రావ్ దొర పాత్రలో ‘రుద్రంగి నాది, రుద్రంగి బిలాంగ్స్ టూ మీ.. బాంచత్’ అంటూ జగపతిబాబు రౌద్రంగా చెప్పిన డైలాగ్.. ఈ సినిమా మాములుగా తెరకెక్కడం లేదనే విషయాన్ని తెలియజేస్తుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు తెలియజేశారు. మరి జగ్గు భాయ్ థర్డ్ ఇన్నింగ్స్ ఏ రకంగా ఉండబోతుందో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.





Updated Date - 2022-10-04T01:24:21+05:30 IST