52 లక్షల గుర్రం, 9 లక్షల పిల్లి, 10 కోట్ల బహుమతులు... దుబాయ్‌కి వెళ్లేందుకు Jacqueline కి నో పర్మిషన్!

ABN , First Publish Date - 2021-12-06T02:58:36+05:30 IST

బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ చట్టపరమైన కష్టాల్లో చిక్కుకుంది. ఆమెకు పేరు మోసిన మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌తో ఉన్న లింకులు దేశం విడిచి వెళ్లకుండా చేశాయి. తాజాగా ముంబై నుంచీ దుబాయ్‌కి బయలుదేరిన జాక్విలిన్ని ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు అడ్డుకున్నారు. త్వరలోనే ఢిల్లీలో తనని ఎన్‌ఫోర్స్‌మెంట్ అఫీషియల్స్ ప్రశ్నించనున్నారు.

52 లక్షల గుర్రం, 9 లక్షల పిల్లి, 10 కోట్ల బహుమతులు... దుబాయ్‌కి వెళ్లేందుకు Jacqueline కి నో పర్మిషన్!

బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ చట్టపరమైన కష్టాల్లో చిక్కుకుంది. ఆమెకు పేరు మోసిన మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌తో ఉన్న లింకులు దేశం విడిచి వెళ్లకుండా చేశాయి. తాజాగా ముంబై నుంచీ దుబాయ్‌కి బయలుదేరిన జాక్విలిన్ని ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు అడ్డుకున్నారు. త్వరలోనే ఢిల్లీలో తనని ఎన్‌ఫోర్స్‌మెంట్ అఫీషియల్స్ ప్రశ్నించనున్నారు.

ఢిల్లీలోని ఓ వ్యాపారవేత్త భార్య నుంచీ 200 కోట్లు అక్రమంగా వసూలు చేశాడంటూ సుఖేశ్ చంద్రశేఖర్ అనే మాజీ తీహార్ జైలు ఖైదీపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. పలు ఇతర కేసుల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటోన్న సుఖేశ్ కొన్నాళ్ల పాటూ తీహార్ జైల్లో ఉన్నాడు. అక్కడ ఉండగానే అతను ఫోన్ కాల్స్ ద్వారా ఢిల్లీలోని ఓ సంపన్న మహిళని బెదిరింపులకు లోను చేశాడు. అలా 200 కోట్లు రాబట్టాడని దర్యాప్తు సంస్థ కోర్టుకు విన్నవించింది. అతనితో బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్‌కు దగ్గరి సంబంధాలు ఉండటమే గత కొంత కాలంగా సంచలనం రేపుతోంది. జాక్విలిన్ తనకు, సుఖేశ్ చంద్రశేఖర్‌కు ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్నప్పటికీ కొన్ని ఫోటోలు లీక్ అవ్వటం పలు అనుమానాలకి తావిస్తోంది. అనేక క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కోంటోన్న సుఖేశ్‌కు గాఢంగా ముద్దు పెడుతూ జాక్విలిన్ కెమెరాకు ఫోజిచ్చిన షాకింగ్ పిక్ ఈ మధ్యే బయటపడింది. అలాగే, నిందుతుడి తరుఫు లాయర్ కూడా జాక్విలిన్ తన క్లైంట్‌తో డేటింగ్ చేసిందని కోర్టులో చెప్పటం మరింత దుమారం రేపింది... 

ఈడీ అధికారులు చెబుతోన్న దాని ప్రకారం జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు సుఖేశ్ చంద్రశేఖర్ 10 కోట్ల విలువైన బహుమతులు ఇచ్చాడట. అందులో 52 లక్షలు విలువ చేసే ఒక గుర్రం, 9 లక్షలు విలువ చేసే ఓ పిల్ల కూడా ఉండటం గమనార్హం! దర్యాప్తు సంస్థ అనుమానిస్తున్నట్టుగా సుఖేశ్ చంద్రశేఖర్ ఆర్దిక మోసంలో జాక్విలిన్‌కు భాగం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ, వరుసగా పంపిన నోటీసులు కూడా ఆమె పట్టించుకోకపోవటంతో విదేశాలకు వెళ్లే అవకాశం కోల్పోవాల్సి వచ్చింది. పలు మార్లు ఈడీ విచారణకు పిలిచినప్పటికీ జాక్విలిన్ గైర్హాజరవుతూ వచ్చింది. దాంతో తాజాగా ఆమెని దుబాయ్‌కి వెళ్లకుండా ముంబై విమానాశ్రయంలో నివారించారు. చూడాలి మరి, జాక్విలిన్‌కు సుఖేశ్ చంద్రశేఖర్ కేసు ఎలాంటి ఇబ్బందుల్ని తెచ్చి పెడుతుందో...        

Updated Date - 2021-12-06T02:58:36+05:30 IST