మోసగాడితో హీరోయిన్ సంబంధం.. సల్మాన్ కాన్‌సర్ట్ నుంచి జాక్వెలిన్ ఔట్

బాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీకి 200 కోట్ల మనీ లాండరింగ్‌లో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌తో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరగగా.. ఈడీ విచారణను ఎదుర్కొంది. కానీ అందులో ఆయన సంబంధం లేనట్లు చెప్పింది ఈ తార. 


అయితే ఇటీవల సుకేశ్‌తో జాక్వెలిన్ ఎంతో క్లోజ్‌గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ బ్యూటీకి సమస్యలు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా అతని నుంచి 10 కోట్ల విలువ చేసే బహుమతులు పొందినట్లు ప్రచారం జరగడమే కాకుండా విచారణకి హాజరుకాకుండా డుమ్మ కొడుతుండడంతో నిన్న ఈ భామని ముంబై ఎయిర్‌పోర్టులోనే ఆపేశారు పోలీసులు. దేశం విడిచి పోకూడదని ఆంక్షలు విధించారు.


నిజానికి ఈ జాక్వెలిన్ త్వరలో సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘దబాంగ్’ అనే కన్‌సర్ట్ చేయాల్సి ఉంది. కానీ మనీ లాండరింగ్ కేసులో ఉన్నట్లు వస్తున్న ఆరోపణల వల్ల ఈ బ్యూటీని ఆ షో నుంచి తొలగించినట్లు సమాచారం. దీంతో ఈ కేసు ఈ భామకి ఇంకా ఎన్ని నష్టాలను కలగజేస్తుందోనని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.