మోసగాడితో హీరోయిన్ ముద్దు వైరల్.. కొత్త సమస్యలో ఇరుకున్న Jacqueline Fernandez

ABN , First Publish Date - 2021-12-01T16:50:03+05:30 IST

బాలీవుడ్ తార, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ మధ్య సినిమాలతో కంటే ఓ మోసగాడితో రిలేషన్‌షిప్‌ వల్ల వార్తల్లో నిలుస్తోంది. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న ఈ మోసగాడు సుకేష్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్నట్లు పుకార్లు బయటికి రావడంతో

మోసగాడితో హీరోయిన్ ముద్దు వైరల్.. కొత్త సమస్యలో ఇరుకున్న Jacqueline Fernandez

బాలీవుడ్ తార, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ మధ్య సినిమాలతో కంటే ఓ మోసగాడితో రిలేషన్‌షిప్‌ వల్ల వార్తల్లో నిలుస్తోంది. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న ఈ మోసగాడు సుకేష్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్నట్లు పుకార్లు బయటికి రావడంతో ఈ అమ్మడికి సమస్యలు ప్రాబ్లెమ్స్ ప్రారంభమయ్యాయి. 


అయితే వీటికి జాక్వెలిన్‌ టీం కొట్టిపారేయగా.. తాజాగా అతనితో ఈ తార క్లోజ్‌గా ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తారకి కొత్త సమస్య మొదలైనట్లైంది. ఆ ఫోటోలో సుకేశ్‌ని గట్టిగా హత్తుకొని బుగ్గ మీద ముద్దు పెడుతోంది ఈ భామ. 


ఈ పిక్ సుకేశ్ బెయిల్ మీద జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మే నుంచి జూన్ మధ్యలో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో జాక్వెలిన్ దాదాపు నాలుగు ఈ కేటుగాడిని కలిసినట్లు సమాచారం. ఈ బ్యూటీ కోసం ఏకంగా ప్రైవేట్ జెట్‌నే ఏర్పాటు చేశాడంటా. ఇంతకుముందు సుకేశ్‌తో సంబంధంపై ఈడీ ప్రశ్నించగా.. అతనితో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది ఈ తార. కాగా జాక్వెలిన్ ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా ‘బచ్చన్ పాండే’, ‘రామ్ సేతు’ వంటి సినిమాలు చేస్తూ కెరీర్‌లో ఎంతో బిజీగా ఉంది.



Updated Date - 2021-12-01T16:50:03+05:30 IST