విదేశంలో ఉంటోన్న బాలీవుడ్ హీరోయిన్ తల్లికి గుండెపోటు... ఆసుపత్రిలో చికిత్స
ABN , First Publish Date - 2022-01-04T23:21:27+05:30 IST
గుండె పోటు వచ్చిన వెంటనే ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఇంకా క్లారిటీ లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది...

బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్ తల్లి గుండె పోటుకు గురయ్యారు. బెహ్రైన్ దేశంలో ఉంటోన్న కిమ్ ఫెర్నాండెజ్ హార్ట్ స్ట్రోక్ కారణంగా హాస్పిటల్‌లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. గుండె పోటు వచ్చిన వెంటనే ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. అయితే, జాక్విలిన్ తల్లి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఇంకా క్లారిటీ లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చాలా రోజులుగా జాక్విలిన్ ఫెర్నాండెజ్ తల్లిదండ్రులు బెహ్రైన్‌లోనే ఉంటున్నారు.
2022 మొదలైన వెంటనే తల్లికి గుండె పోటు రావటం జాక్విలిన్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఆమెకు 2021 కూడా ఏమంత కలసి రాలేదు. పైగా సుఖేశ్ చంద్రశేఖర్ అనే మోసగాడితో ఆమెకు ఎపైర్ అంటూ వార్తలొచ్చాయి. 200 కోట్ల మోసానికి పాల్పడ్డ చంద్రశేఖర్ ప్రస్తుతం ఈడీ అధికారుల అధీనంలో ఉన్నాడు. అతను విచారణలో జాక్విలిన్ తన గాళ్‌ఫ్రెండ్ అంటూ బాంబు పేల్చాడు. జాకీ కూడా తాను చంద్రశేఖర్ నుంచీ కోట్ల విలువైన బహుమతులు, డబ్బు తీసుకున్నట్టు అంగీకరించింది.
ఓ వైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచీ చట్టపరమైన చిక్కులు కొనసాగుతుండగానే జాక్విలిన్ తల్లికి హార్ట్ స్ట్రోక్ రావటం షాక్ అనే చెప్పాలి. ఆమె పేరు 200 కోట్ల హవాలా కేసులో వినిపిస్తుండటంతో ప్రస్తుతం దేశం విడిచి వెళ్లటానికి వీల్లేకుండా నోటీసులు జారీ అయ్యాయి. బెహ్రైన్‌లో హాస్పిటల్లో ఉన్న తల్లిని చూడటానికి జాక్విలిన్ ఇండియా దాటి వెళ్లగలుగుతుందో లేదో... చూడాలి మరి...
