చిన్ననాటి స్నేహితురాల్ని పెళ్ళి చేసుకున్న ముక్కు అవినాశ్

జబర్దస్త్ కామెడీ షోతో మంచి పేరు తెచ్చుకున్న ముక్కు అవినాశ్ ఓ ఇంటివాడయ్యారు.  చిన్ననాటి స్నేహితురాలైన అనూజ వాకిటి మెళ్ళో మూడు ముళ్ళు వేశారు అవినాశ్. పెళ్లి దుస్తుల్లో భార్య నుదుట ముద్దు పెట్టుకొంటున్న ఓ ఫోటో ను అవినాశ్ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు. ‘ఇంతటి ఘనంగా పెళ్ళి జరుగుతున్నందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతుడ్ని. మా పెళ్ళికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ ఓ కేప్షన్ జతచేశారు. వీరి నిశ్చితార్ధం ఆగస్ట్ లో జరిగింది. ఇక ఈ పెళ్ళికి వర్షిణి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, రోల్ రైడర్, అలేఖ్య హారిక, దివి, లాస్య ఈ పెళ్ళికి హాజరయ్యారు. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.