SALMAN నీడలో... ఎన్ని లాభాలో, అన్ని నష్టాలు కూడా

ABN , First Publish Date - 2022-01-29T01:38:25+05:30 IST

బాలీవుడ్ బ్యాచిలర్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ గాళ్‌ఫ్రెండ్‌గా బోలెడు ప్రచారం పొందింది లూలియా వంటూర్. యూరప్‌లోని రొమానియా దేశానికి చెందిన టెలివిజన్ ప్రజెంటర్ అండ్ సింగర్ ఆమె. అయితే, ఇండియాలో మాత్రం లూలియాను సల్మాన్ ప్రియురాలంటూ...

SALMAN నీడలో... ఎన్ని లాభాలో, అన్ని నష్టాలు కూడా

బాలీవుడ్ బ్యాచిలర్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ గాళ్‌ఫ్రెండ్‌గా బోలెడు ప్రచారం పొందింది లూలియా వంటూర్. యూరప్‌లోని రొమానియా దేశానికి చెందిన టెలివిజన్ ప్రజెంటర్ అండ్ సింగర్ ఆమె. అయితే, ఇండియాలో మాత్రం లూలియాను సల్మాన్ ప్రియురాలంటూ మీడియా చాలా కాలంగా ప్రచారం చేస్తోంది. ఆ విషయంలో ఇంత వరకూ సల్మాన్‌గానీ, లూలియాగానీ నోరు విప్పలేదు. తమ ఏం లేదని ఖండించను కూడా ఖండించలేదు!


బాలీవుడ్ సీనియర్ మోస్ట్ బ్రహ్మచారితో తన బంధం సంగతి ఎలా ఉన్నా... లూలియా తాజాగా ఆయన నీడ గురించి మాత్రం మాట్లాడింది. సూపర్ స్టార్ షాడోలో ఉండటం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో, అన్ని డిజ్అడ్వాంటేజెస్ కూడా ఉంటాయట. సల్మాన్‌కి సన్నిహితంగా ఉండటం వల్ల ‘‘మీరు అందరికీ కనిపిస్తూ ఉంటారు. దాని వల్ల ఎంతో లాభం చేకూరుతుంది’’ అంటోంది లూలియా. అంతే కాదు, ‘‘చివరకు వచ్చేసరికి మనం మరింత ఎక్కువ శ్రమ పడాలి... అప్పుడే జనం ‘లూలియా’గా గుర్తిస్తారు. లేదంటే మరెవరితోనో ముడిపడ్డ ఇంకో వ్యక్తిగా మిగిలిపోతాం...’’ అని కూడా చెబుతోంది వైట్ బ్యూటీ! 


సల్మాన్ నీడలోంచి బయటపడి తనకంటూ గుర్తింపు సాధించుకుంటానని ప్రకటించిన లూలియా వంటూర్ లెటెస్ట్‌గా ‘మై ఛలా’ మ్యూజిక్ వీడియోతో జనం దృష్టిని ఆకర్షించింది. బీ-టౌన్ సింగర్ గురు రంధావాతో ఆమె స్వరం కలిపింది. తెర వెనుక ఆమె హల్‌చల్ చేయగా ఆన్‌స్క్రీన్ యాజ్‌యూజ్‌వల్ సల్మాన్ మెరిసిపోయాడు. ఆయనతో దక్షిణాది అందాల రాశి ప్రగ్యా జైస్వాల్ ఆడి, పాడింది. చూడాలి మరి, సల్మాన్ గాళ్‌ఫ్రెండ్‌గా కాక తనని తన టాలెంట్ కారణంగా గుర్తించాలని కోరుకుంటోన్న లూలియా వంటూర్... ఆశలు ఎప్పటికి నెరవేరుతాయో...  

Updated Date - 2022-01-29T01:38:25+05:30 IST