చిరంజీవి గారు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం నా అదృష్టం

ABN , First Publish Date - 2022-02-17T11:33:13+05:30 IST

‘కరోనా టైమ్‌లో మోహన్‌బాబు గారిని కలిసి ‘సన్నాఫ్‌ ఇండియా’ కథ చెప్పాను. నా గత చిత్రం ప్లాప్‌ అయినా కూడా నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు...

చిరంజీవి గారు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం నా అదృష్టం

‘కరోనా టైమ్‌లో మోహన్‌బాబు గారిని కలిసి ‘సన్నాఫ్‌ ఇండియా’ కథ చెప్పాను. నా గత చిత్రం ప్లాప్‌ అయినా కూడా నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. మోహన్‌బాబు పాత్రకు చిరంజీవిగారు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం, ఇళయరాజా సంగీతం అందించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఓటీటీని దృష్టిలో పెట్టుకొని సినిమాను రూపొందించినా, మోహన్‌బాబుగారు థియేటర్లలోనే రిలీజ్‌ చేయాలనుకున్నారు’ అని దర్శకుడు డైమండ్‌ రత్నబాబు అన్నారు. ఈ చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా ఆయన సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ఒక ప్రయోగాత్మక చిత్రం. సినిమా నిడివి కూడా గంటన్నరే. సగటు చిత్రాలకు ఇది భిన్నమైనది. విరూపాక్ష అనే పాత్రలో క్లైమాక్స్‌లో మోహన్‌బాబు గారు చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు సినిమాకు ప్రధానాక ర్షణ. న్యాయ వ్యవస్థలో లొసుగులను ప్రశ్నించేలా ఆయన పాత్ర ఉంటుంది’ అని అన్నారు. 


Updated Date - 2022-02-17T11:33:13+05:30 IST