ఈషా డియోల్ రీ ఎంట్రీ

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఈషా డియోల్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. 2012లో భరత్ తక్తానిని పెళ్లి చేస్తున్న తర్వాత సినిమాలకి దూరంగా ఉంటోంది. దాదాపు 8 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ కెమెరా ముందుకు రాబోతోంది. అయితే, బిగ్ స్క్రీన్ మీద కాకుండా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. 'రుద్రా : ద ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్'తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈమె, ఇందులో అజయ్ దేవగణ్‌తో కలిసి కనిపించబోతోంది. బ్రిటన్‌లో హిట్ అయిన వెబ్ సిరీస్ 'లూథర్'. ఈ సీరిస్‌ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో కలసి బీబీసీ రూపొందిస్తున్న దీనిని మార్పులు చేర్పులు చేసి 'రుద్ర' పేరుతో తీసుకు రాబోతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్‌లో అజయ్ దేవగణ్ టైటిల్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఆయనకి కూడా 'రుద్ర' సీరిసే డిజిటల్ డెబ్యూ ప్రాజెక్ట్. మరి అజయ్ - ఈషా డియోల్ ఈ డెబ్యూ సిరీస్‌తో ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. 

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.