స్నేహమంటే ఇదేరా!
ABN , First Publish Date - 2022-09-26T06:36:10+05:30 IST
జగపతిబాబు - అర్జున్ మంచి స్నేహితులు. ఈ విషయం అందరికీ తెలిసిందే. జగ్గూభాయ్ గురించి అర్జున్.. యాక్షన్ కింగ్ గురించి...

జగపతిబాబు - అర్జున్ మంచి స్నేహితులు. ఈ విషయం అందరికీ తెలిసిందే. జగ్గూభాయ్ గురించి అర్జున్.. యాక్షన్ కింగ్ గురించి జగ్గూ భాయ్ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. ఇద్దరూ కలిసి ‘హనుమాన్ జంక్షన్’లో కూడా నటించారు. ఆ తరవాత ఒకట్రెండు సినిమాలు చేసినా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు మళ్లీ ఇద్దరూ కలిసి ఓ సినిమా కోసం పని చేస్తున్నారు. అర్జున్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ సెట్లోనే.. తన స్నేహితుడికి స్వయంగా మేకప్ వేస్తూ కనిపించారు అర్జున్. ఈ ఫొటోని జగపతిబాబు తన ట్విట్టర్‌లో షేర్ చేసుకొన్నారు.