స్నేహమంటే ఇదేరా!
ABN , First Publish Date - 2022-08-08T06:14:02+05:30 IST
నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఒదెల దర్శకుడు. చెరుకూరి శ్రీనివాస్ నిర్మాత. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది....

నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఒదెల దర్శకుడు. చెరుకూరి శ్రీనివాస్ నిర్మాత. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఇది వరకెప్పుడూ లేని, మాస్ అవతార్‌లో దర్శనమిస్తున్నాడు నాని. గళ్ల చొక్కా, లుంగీ, మాసిన గెడ్డం, ఒత్తుగా పెరిగిన జుత్తు.. ఈ గెటప్ మాస్‌ని బాగా ఆకట్టుకుంటోంది. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఆదివారం ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. నాని అండ్ గ్యాంగ్‌తో తీర్చిదిద్దిన ఈ పోస్టర్.. స్నేహానికి, వాళ్ల అల్లరికి నిదర్శనంగా కనిపిస్తోంది. సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో సాగే కథ ఇది. నాని తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేయబోతున్నారు. సంగీతం: సంతోష్ నారాయణన్.