వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ ఇదేనా..?

ABN , First Publish Date - 2022-01-13T13:58:12+05:30 IST

వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ ఇదేనా..? అంటూ రెండు ఆసక్తికరమైన టైటిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 'ఉప్పెన' సినిమాతో డెబ్యూ హీరో రికార్డ్స్ బద్దలు కొట్టిన ఈ మెగా మేనల్లుడు..

వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ ఇదేనా..?

వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ ఇదేనా..? అంటూ రెండు ఆసక్తికరమైన టైటిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 'ఉప్పెన' సినిమాతో డెబ్యూ హీరో రికార్డ్స్ బద్దలు కొట్టిన ఈ మెగా మేనల్లుడు.. ఆ తర్వాత 'కొండపొలం' సినిమాతోనూ బాగానే ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తన మూడవ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించిన గీరిషయ్య వైష్ణవ్ తేజ్ 3వ చిత్రం రూపొందిస్తున్నాడు. 'రొమాంటిక్' బ్యూటి కేతిక శర్మ ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఈ సినిమాకు 'రంగ రంగ వైభవంగ', 'ఆబాల గోపాలం' అనే టైటిల్స్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఎక్కువగా అందరి దృష్ఠి 'రంగ రంగ వైభవంగ' మీదే ఉన్నట్టు తెలుస్తోంది. మరి చిత్రబృందం ఏ టైటిల్‌ను ప్రకటిస్తారో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పీ పతాకంపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.    

Updated Date - 2022-01-13T13:58:12+05:30 IST