'ఏకే' రీమేక్ తెలుగు టైటిల్ ఇదేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి కలిసి మలయాళ సూపర్ హిట్ సినిమా 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా తెలుగు టైటిల్ ఇదేనా..అంటూ ఒక టైటిల్ ప్రచారంలో ఉంది. యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడరు. ఇందులో హీరోయిన్స్‌గా నిత్యామీనన్, ఐశ్వర్యరాజేశ్‌లు నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ చిత్ర బృందం వెల్లడించాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటినుంచి 'బిల్లా-రంగా' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పుడు మరో టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 'పరశురామ కృష్ణమూర్తి' అనే టైటిల్ పెట్టాలని చిత్ర బృందం భావిస్తోందట. దీనిపై త్వరలో స్పష్ఠత రానుంది. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.