ప్రశాంత్ నీల్ సినిమాల ఆర్డర్ ఇదేనా..!

కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. 'కేజీఎఫ్ ఛాప్టర్ 1' సక్సెస్ తర్వాత మన టాలీవుడ్ హీరోలు, మేకర్స్ ఆయనతో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ వరుసగా టాలీవుడ్ స్టార్స్‌తో పాన్ ఇండియన్ సినిమాలను లైనప్ చేసుకున్నారు. అయితే, ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది..ఏ హీరో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే పెద్ద కన్‌ఫ్యూజన్ అభిమానుల్లో నెలకొంది.

తాజాగా ఈ విషయంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ కమిటయిన ప్రాజెక్ట్స్ లైనప్ ఇదేనని తెలుస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో 'సలార్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే, 'కేజీఎఫ్ 2'కి కొంత రీ షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ రెండు సినిమాలు 2022లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ సినిమా మొదలు పెడతరాని, దాని తర్వాత తారక్ - మైత్రీ మూవీ మేకర్స్ మూవీ, దీని తర్వాత అల్లు అర్జున్ -గీతా ఆర్ట్స్ మూవీ చేయనున్నారట. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వస్తే ఈ ఆర్డర్ మారే అవకాశాలూ ఉన్నాయట. మొత్తానికి మరో మూడేళ్ళు ప్రశాంత్ నీల్ బిజీగా ఉంటారని అర్థమవుతోంది. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.