'పుష్ప'లో అనసూయ లుక్ ఇదేనా..!

ABN , First Publish Date - 2021-08-06T14:16:41+05:30 IST

'పుష్ప'లో అనసూయ లుక్ ఇదేనంటూ ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పుష్ప' రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

'పుష్ప'లో అనసూయ లుక్ ఇదేనా..!

'పుష్ప'లో అనసూయ లుక్ ఇదేనంటూ ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పుష్ప' రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఇందులో బుల్లితెర యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే, తాజాగా 'పుష్ప' సెట్ నుంచి ఆమె ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 


సుకుమార్ గత చిత్రం 'రంగస్థలం'లో అనసూయ గెటప్ ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'పుష్ప'లోనూ విభిన్నమైన గెటప్‌లో అనసూయ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక అనసూయ ఈ సినిమాలో సునీల్ భార్యగా నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. కాగా 5 భాషలలో రూపొందుతున్న 'పుష్ప' పార్ట్ వన్ ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈనెల 13న ఫస్ట్ సింగిల్ రాబోతోంది. 

Updated Date - 2021-08-06T14:16:41+05:30 IST