శర్వా30 టైటిల్ ఇదేనా..?

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్‌లో 30వ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో సెట్స్ మీదకి రానున్న ఈ చిత్రానికి టైటిల్ ఇదే అంటూ ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది.  శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ లేటెస్ట్ మూవీని డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. కాగా ఈరోజు ( జూన్ 28 సోమవారం ) సాయంత్రం 5 గంటలకు చిత్ర టైటిల్ అలాగే ఇతర వివరాలను ప్రకటించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా మేకర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో దీనికి 'ఒకే ఒక జీవితం' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. ఇదే టైటిల్‌ను అధికారకంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ప్రచారంలో ఉన్న ఈ టైటిన్‌నే ప్రకటించబోతున్నారా లేక మరేదైనా ఇంట్రెస్టింగ్ టైటిల్ రివీల్ చేయనున్నారా అనేది త్వరలో తెలియనుంది. ప్రస్తుతం శర్వా 'మహాసముద్రం', 'ఆడవాళ్ళూ మీకు జోహార్లు' అనే సినిమాలలో నటిస్తున్నాడు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.