Raviteja కి హిట్ ఇచ్చే దర్శకుడే లేడా..?

ABN , First Publish Date - 2022-08-27T17:19:02+05:30 IST

మాస్ మహారాజ రవితేజ (Raviteja)కి హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరైనా ఉన్నారా..? అంటే దీనికి సరైన సమాధానం రావడం లేదు. వరుస ఫ్లాపుల తర్వాత ఈ మాస్ మహారాజ గోపీచంద్ మలినేని (Gopichand malineni) దర్శకత్వంలో

Raviteja కి హిట్ ఇచ్చే దర్శకుడే లేడా..?

మాస్ మహారాజ రవితేజ (Raviteja)కి హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరైనా ఉన్నారా..? అంటే దీనికి సరైన సమాధానం రావడం లేదు. వరుస ఫ్లాపుల తర్వాత ఈ మాస్ మహారాజ గోపీచంద్ మలినేని (Gopichand malineni) దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా అటు దర్శకుడికి, ఇటు హీరోహీరోయిన్స్‌గా నటించిన రవితేజ, శృతి హాసన్‌లకు మూడేళ్ల తర్వాత దక్కిన హిట్. ఈ సినిమా తర్వాత ముగ్గురూ బిజీ అయిపోయారు. ముఖ్యంగా రవితేజ అరడజను సినిమాలను లైన్‌లో పెట్టారు.


అయితే, క్రాక్ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన ఖిలాడి, రామారావు ఆన్‌డ్యూటీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా పడ్డాయి. అదే రొట్టకొట్టుడు రొటీన్ కథలను ఎంచుకోవడమే మాస్ మహారాజాకి ఫ్లాప్స్ పడటానికి కారణం అని సినిమాలు చూసిన అందరూ అభిప్రాయపడ్డారు. ఇక రవితేజ పర్ఫార్మెన్స్‌లోనూ ఏమాత్రం కొత్తదనం లేకపోవడంపై కూడా కామెంట్స్ వినిపించాయి. దాదాపు ఆయనతో సినిమా చేస్తున్న దర్శకులు రవితేజకి ఉన్న మాస్ ఇమేజ్‌ను దృష్ఠిలో పెట్టుకొనే మాస్ కథలు రాస్తున్నారు తప్ప, వినూత్నంగా ట్రై చేయడం లేదు.


దాంతో భిన్నమైన కథతో రవితేజకి హిట్ ఇచ్చే దర్శకుడెవరని ఇప్పుడు ఆయన అభిమానులే మాట్లాడుకుంటున్నారట. నిజమే, ప్రస్తుతం అంతా పాన్ ఇండియా సినిమా అనే ట్రెండ్ కొనసాగుతోంది. అందరు హీరోలు ఆ క్రేజ్ కోసమే పాకులాడుతున్నారు. మన మాస్‌రాజా మాత్రం ఆ మాస్ కథలనే  పట్టుకొని వేళాడుతున్నారు. ఇప్పుడు చేస్తున్న ధమాకా (Dhamaka) కంప్లీట్ కామెండీ ఎంటర్‌టైనర్ అంటున్నారు. ఇది కూడా ఆయన మార్క్ మాస్ మూవీనే. అలాగే, వంశీకృష్ణ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) అనే బయోపిక్ మూవీ కూడా చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ. రావణాసుర (Ravanasura) అనే మరో మాస్ ఎంటర్‌టైనర్‌తో పాటుగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి మెగా 154 లో నటిస్తున్నారు. మరి వీటిలో రవితేజకి భారీ హిట్ ఇచ్చే దర్శకుడెవరో చూడాలి. 

Updated Date - 2022-08-27T17:19:02+05:30 IST