ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌తో ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..కేదార్నాథ్ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సారా అలీఖాన్. ఆ సమయంలో సుశాంత్‌తో సారా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాత కార్తీక్ ఆర్యన్‌తో లవ్‌ట్రాక్ నడిపినట్లు కూడా బాలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు కేదార్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ జెహన్ హండాతో సారా ప్రేమలో ఉన్నట్లు అంటున్నారు. ఈ వార్తలకు బలం చేకూర్చేలా సారా అలీఖాన్ తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. జెహన్ హండాతో సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసిన సారా.. 'లవ్ యూ, మళ్లీ నన్ను అడక్కు తీసుకెళ్లిపో' అనే మెసేజ్‌ను కూడా పోస్ట్ చేసింది. మరి వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారా? ఉంటే..వీరి ప్రేమ పెళ్లి వైపు అడుగు లేస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.