పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 'PSPK 28'వ చిత్రంగా రానున్న ఇందులో పవన్‌కల్యాణ్‌ని యంగ్, పవర్ఫుల్ ఎనర్జిటిక్ లుక్‌లో హరీశ్ చూపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే హరీశ్ శంకర్ తాజాగా 'బద్రి' సినిమా నుంచి పవన్‌కల్యాణ్ పవర్ఫుల్ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. "మరోసారి అదే ఎనర్జీని చూద్దాం" అని ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. ఈ వీడియోలో ఎక్కువసార్లు నందా పేరు పవన్ నోటి నుంచి వినిపించింది. దీంతో అభిమానులు, ఈ సినిమాలో విలన్‌గా విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ నటించబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ నటించిన 'బద్రి', 'కెమెరామెన్ గంగతో రాంబాబు', ఇటీవల వచ్చిన 'వకీల్ సాబ్' సినిమాలోనూ ప్రకాశ్‌రాజ్ నటించారు. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు', 'ఏకే' రీమేక్ సమాంతరంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.