నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ఊరమాస్ గెటప్‌లో కనిపించబోతున్న లేటెస్ట్ మూవీ 'దసరా' (Dasara). తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన న్యూస్ ఒకటి వచ్చి నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈరోజే 'అంటే సుందరానికీ' (Ante Sundaraniki) అనే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఈ సినిమాకు ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ వినిపిస్తోంది. మలయాళం స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్ (Nazriya Nazeem) ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిచారు.
అయితే, 'దసరా' షూటింగ్ మొదలయ్యాక కొంత టాకీ పార్ట్ పూర్తి చేసిన నాని, 'అంటే సుందరానికీ' సినిమా ప్రమోషన్స్ కారణంగా కాస్త బ్రేక్ ఇచ్చాడు. దాంతో ముందునుంచి ఈ మూవీని దసరా బరిలో దింపాలనుకుంటే ఇప్పుడు అది సాధ్యపడేలా లేదని తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కంప్లీట్ మాస్ ఎలిమెంట్స్‌లో నిర్మిస్తున్నారు. ఇందులో నాని సరసన కీర్తి సురేశ్ (Keerthi Suresh) హీరోయిన్గా నటిస్తోంది. ఇక 'దసరా' నాని కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.
కాగా, త్వరలో నాని మళ్ళీ 'దసరా' సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. వీలైంత త్వరగా చిత్రాన్ని పూర్తి చేసి గత ఏడాది 'శ్యామ్ సింగరాయ్' సినిమాను రిలీజ్ చేసినట్టుగానే క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ చేయనున్నారట. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎస్ ఎల్ వి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మరి నాని కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుస్తున్న 'దసరా' పాన్ ఇండియన్ స్టార్‌గా ఏమేరకు క్రేజ్ తీసుకువస్తుందో చూడాలి.