'లవ్‌స్టోరి' రిలీజ్‌ డేట్‌ ఫిక్సయ్యిందా?

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ప్లెజంట్ ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న మరో చిత్రం  'లవ్ స్టోరి`. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కొవిడ్‌ నేపథ్యంలో సినిమాను విడుదల చేయలేదు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నాయి. సినిమాలు నెమ్మదిగా థియేటర్స్‌లో విడుదల కావడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో 'లవ్‌స్టోరి' మేకర్స్‌ సినిమాను ఆగస్ట్‌ మొదటివారంలో విడుదల చేయాలని అనుకుంటున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని టాక్‌. ఈ చిత్రంలో హీరో నాగచైతన్య డాన్స్‌ మాస్టర్‌గా రాణించాలనుకునే కుర్రాడిగా, హీరోయిన్ సాయిపల్లవి సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేయాలనుకునే అమ్మాయిగా కనిపిస్తారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. 'ఫిదా' తర్వాత శేఖర్‌ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రమిది. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.