Keerthy Suresh: కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతోందా?.. వాటిలో నిజమెంత..

ABN , First Publish Date - 2022-11-29T15:03:17+05:30 IST

సినీ ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్ గురించి ఏదో ఒక ప్రచారం అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా నటీమణుల పెళ్లి, ప్రేమ విషయంలో అయితే ఈ రూమర్స్ అంతే ఉండదు...

Keerthy Suresh: కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతోందా?.. వాటిలో నిజమెంత..

సినీ ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్ గురించి ఏదో ఒక ప్రచారం అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా నటీమణుల పెళ్లి, ప్రేమ విషయంలో అయితే ఈ రూమర్స్ అంతే ఉండదు. ఇప్పటికే చాలామందిపై అలాంటి రూమర్స్ (Rumours) రాగా.. కొందరి విషయంలో నిజమయ్యాయి. మరికొందరి విషయంలో కాలేదు. తాజాగా మలయాళ భామ కీర్తి సురేశ్‌ (Keerthy Suresh)కు పెళ్లి కుదిరినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


కీర్తీ తల్లిదండ్రులు వరుడిని ఖరారు చేయడం వల్లే ఆమె  ఇటీవల రాష్ట్రంలోని తిరునెల్వేలిలో తన పూర్వీకుల ఇంటిని సందర్శించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకున్నట్టు సమాచారం. అయితే.. ఈ వార్తలపై ఇటు కీర్తి సురేశ్‌గానీ, ఆమె తల్లిదండ్రులుగానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు.. పెళ్లి ఖాయం కావడం వల్లే కీర్తి సురేశ్ కొత్తగా సినిమాలు కూడా అంగీకరించడం లేదనే వాదనలు కోలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, ‘ఇది ఎన్న మాయం’ అనే చిత్రం ద్వారా ఆమె తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. అనంతరం రామ్ పొతినేని హీరోగా నటించిన ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి వరుసగా కంటెంట్ ఉన్న పాత్రలు చేస్తూ టాప్ హీరయిన్‌గా ఎదిగింది.





Updated Date - 2022-11-29T15:03:17+05:30 IST