Project K: ప్రభాస్ సినిమాలో స్టార్ హీరోలు నటిస్తున్నారా..?

ABN , First Publish Date - 2022-09-04T01:17:43+05:30 IST

‘బాహుబలి’ (Baahubali) ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమా ఇచ్చిన ఇచ్చిన జోష్ తో అతడు నటిస్తున్న ప్రాజెక్టులన్ని పాన్ ఇండియాగా

Project K: ప్రభాస్ సినిమాలో స్టార్ హీరోలు నటిస్తున్నారా..?

‘బాహుబలి’ (Baahubali) ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమా ఇచ్చిన ఇచ్చిన జోష్‌తో అతడు నటిస్తున్న ప్రాజెక్టులన్ని పాన్ ఇండియాగా రూపొందుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అనేక చిత్రాలు ఉన్నాయి. అతడు ‘ఆదిపురుష్’  (Adipurush) షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేశాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ‘సలార్’, ‘ప్రాజెక్టు-కె’, ‘స్పిరిట్’ వంటి చిత్రాలను ఇప్పటికే పట్టాలెక్కించాడు. ప్రభాస్ ఒకేసారి ‘సలార్’, ‘ప్రాజెక్ట్-కె’ (Project K) షూటింగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ‘ప్రాజెక్ట్- కె’ ను వైవిధ్య దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్‌గా రూపొందుతుంది. ‘మహా‌నటి’ అనంతరం నాగీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ‘ప్రాజెక్ట్- కె’ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. 


‘ప్రాజెక్ట్-కె’ లో కొన్ని కీలకమైన పాత్రలు ఉన్నాయని సమాచారం. ఈ రోల్స్ సినిమాలో ఉన్నది కాసేపే అయినప్పటికి చిత్రాన్ని మలుపు తిప్పుతాయంట. ఈ పాత్రలను సూర్య (Suriya), మహేశ్ బాబు (Mahesh Babu), దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)లతో చేయించాలని మేకర్స్ అనుకుంటున్నారట. అందుకోసం వారితో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఈ పాత్రల్లో వారు నటిస్తారో, లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. ‘ప్రాజెక్ట్ - కె’ ను వైజయంతి మూవీస్ రూ. 500కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియాగా రూపొందుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 55శాతానికి పైగా పూర్తయింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

Updated Date - 2022-09-04T01:17:43+05:30 IST