స్టార్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తోన్న చియాన్ విక్రమ్ కొడుకు..?
ABN , First Publish Date - 2022-01-03T00:07:19+05:30 IST
విభిన్న రకాల పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు చియాన్ విక్రమ్. అపరిచితుడు, ఐ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు

విభిన్న రకాల పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు చియాన్ విక్రమ్. అపరిచితుడు, ఐ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ కూడా సినిమాల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ హిట్ చిత్రం ‘‘ అర్జున్ రెడ్డి ’’ ని ‘‘ ఆదిత్య వర్మ ’’ పేరుతో ధ్రువ్ కోలీవుడ్‌లో రీమేక్ చేశారు. ఈ సినిమాలో అతడి సరసన బనితా సంధు హీరోయిన్‌గా నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరూ స్నేహితులుగా మారారని తెలుస్తోంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని కోలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ధ్రువ్ , బనితా సంధు కొత్త ఏడాది సంబరాలను దుబాయ్‌లో జరుపుకొన్నారు. హోటల్ రూంలో బనితా సంధు ఉన్న 2 వీడియోస్‌ని ఇన్‌స్టాగ్రాం స్టోరీస్‌లో ధ్రువ్ షేర్ చేశారు. మొదట బుర్జ్ ఖలీఫాని బనితా సంధు చూస్తున్న వీడియోని పంచుకున్నారు. ఈ జంట 2022కు స్వాగతం పలుకుతున్న దృశ్యాలను రెండో వీడియోగా షేర్ చేశారు. వీడియోలను పోస్ట్ చేయగానే నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఈ జంట డేటింగ్ చేస్తుందని సోషల్ మీడియా యూజర్స్ కోడై కూస్తున్నారు.

