‘ఆర్ఆర్ఆర్’..అజయ్ దేవగణ్ రోల్ అదేనా?

కొమురం భీమ్‌గా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఫిక్ష‌నల్ పీరియాడిక‌ల్ డ్రామాను ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ స్టార్ హీరోల‌తో పాటు బాలీవుడ్ నుంచి అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్‌, హాలీవుడ్  నుంచి రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి, ఒలివియా మోరిస్ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో న‌టిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో అజ‌య్ దేవ‌గ‌ణ్ పాత్ర‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదేంటంటే.. ఈ బాలీవుడ్ స్టార్ కొమురం భీమ్ తండ్రి పాత్ర‌లో అంటే ఎన్టీఆర్ తండ్రి పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. మ‌రి ఇందులో వాస్త‌వాలు తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ ద‌స‌రాకు విడుద‌ల‌వుతుంద‌ని ముందుగా నిర్మాత‌లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా షూటింగ్ ఆగింది. దీంతో సినిమాను వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.