Salaar : ఆ సీక్వెన్స్ రీషూట్ చేస్తారా?

ABN , First Publish Date - 2021-12-06T15:14:18+05:30 IST

ఇండియన్ స్ర్కీన్ పైనే మోస్ట్ ఎవైటెడ్ మూవీ ప్రభాస్ ‘సలార్’. పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాకా.. ప్రభాస్ నుంచి రాబోతున్న మరో భారీ యాక్షన్ మూవీ కావడంతో ‘సలార్’ చిత్రంపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఈ సినిమాపై బాలీవుడ్ లోనూ ఆసక్తి మొదలైంది. ‘కేజీఎఫ్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా అవడం వల్ల అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

Salaar : ఆ సీక్వెన్స్ రీషూట్ చేస్తారా?

ఇండియన్ స్ర్కీన్ పైనే మోస్ట్ ఎవైటెడ్ మూవీ ప్రభాస్ ‘సలార్’. పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాకా.. ప్రభాస్ నుంచి రాబోతున్న మరో భారీ యాక్షన్ మూవీ కావడంతో ఈ చిత్రంపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఈ సినిమాపై బాలీవుడ్ లోనూ ఆసక్తి మొదలైంది.  ‘కేజీఎఫ్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా అవడం వల్ల అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే ఆ అంచనాల్ని అందుకోవాలనే తపనతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాకి సంబంధించి ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవడంలేదు.  


అసలు విషయానికొస్తే ‘సలార్’ ఇంటర్వెల్ సీక్వెన్స్ పై మళ్ళీ ప్యాచ్ వర్క్ చేస్తున్నారట. నిజానికి ఈ సీన్ షూట్ ఇదివరకే పూర్తయింది. అయితే ఔట్ పుట్ విషయంలో ప్రశాంత్ అసంతృప్తిగా ఉన్నారట. అందుకే ఈ సీన్ ను రీషూట్ చేయాలని  భావిస్తున్నారట. ఈ సీన్ సినిమాకే హైలైట్ కావడంతో ఆ విషయంలో దర్శకుడు పట్టుదలగా ఉన్నారట. ఇక ఈసినిమాలోని ఒక స్సెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ ను ఎంపిక చేశారట. ఇంతకు ముందు ప్రభాస్, శ్రద్ధల జోడీ ‘సాహో’లో అలరించిన సంగతి తెలిసిందే. మరి ‘సలార్’ చిత్రం ప్రభాస్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.  

Updated Date - 2021-12-06T15:14:18+05:30 IST