రాముడిగా శోభన్‌బాబు.. థియేటర్లలో రెండు వారాలు జనమే లేరు!

ABN , First Publish Date - 2021-12-12T01:03:25+05:30 IST

1972 మార్చి 16న ‘ సంపూర్ణ రామాయణం’ చిత్రం విడుదలైంది. కానీ కలెక్షన్లు నిల్లు. థియేటర్‌లో జనం అంతంత మాత్రమే. రెండు వారాల వరకూ ఇదే పరిస్థితి. ఈ టాక్‌ విని భయపడిన శోభన్‌బాబు ఇంట్లోంచి బయటకు వచ్చేవారు కాదు. ఆ తర్వాత..

రాముడిగా శోభన్‌బాబు.. థియేటర్లలో రెండు వారాలు జనమే లేరు!

దర్శకుడు బాపు రూపొందించిన తొలి పౌరాణికం ‘సంపూర్ణ రామాయణం’. శ్రీరాముడంటే ఎన్టీ రామారావే అని ప్రేక్షకులు ఫిక్స్‌ అయిన తరుణంలో  ఇందులో శోభన్‌బాబును రాముడి పాత్రకు ఎన్నుకోవడం సంచలనం అయింది. ‘కమ్యూనిస్టు ఆరుద్ర, కామెడీ రైటర్‌ ముళ్లపూడి రమణ, కార్టూనిస్ట్‌ బాపు.. రామాయణం సినిమా తీయడమా, అందులో రాముడిగా శోభన్‌బాబుని ఎన్నుకోవడమా.. హవ్వ’ అనే విమర్శలు ఈ చిత్రనిర్మాణ సమయంలో వినిపించాయి. దానికి తోడు ఎన్టీఆర్‌ ఎప్పటినుంచో ‘శ్రీరామ పట్టాభిషేకం’ సినిమా తీయాలని సముద్రాల రాఘవచార్యతో స్ర్కిప్ట్‌ తయారు చేయించి సిద్ధంగా ఉన్నారు. అందుకే సినిమా ప్రారంభించే ముందు ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లి ఈ విషయం తెలిపారు బాపు, రమణ. ‘తీసుకోండి. కానీ నేను షూటింగ్‌ ప్రారంభిస్తే మీరు ఇబ్బంది పడతారు’ అన్నారు ఎన్టీఆర్‌. సరేనని చెప్పి వచ్చేశారు బాపు, రమణ. 


విమర్శలను పట్టించుకోకుండా నిష్టతో, ఏకాగ్రతతో సినిమా పూర్తి చేశారు. ఆ రోజుల్లో మందు లేకపోతే రోజు గడవని పరిస్థితి ఎస్వీ రంగారావుది. ఆయన కూడా ఆరు నెలల పాటు మందు జోలికి పోకుండా నిష్టగా ఉంటూ ఈ చిత్రంలో రావణాసురుడి పాత్ర పోషించారు. 1972 మార్చి 16న ‘ సంపూర్ణ రామాయణం’ చిత్రం విడుదలైంది. కానీ కలెక్షన్లు నిల్లు. థియేటర్‌లో జనం అంతంత మాత్రమే. రెండు వారాల వరకూ ఇదే పరిస్థితి. ఈ టాక్‌ విని భయపడిన శోభన్‌బాబు ఇంట్లోంచి బయటకు వచ్చేవారు కాదు. ఆ తర్వాత ‘సినిమా బాగుంది’ అనే టాక్‌ స్ర్పెడ్‌ అవడంతో థియేటర్లు పట్టనంత జనం వచ్చారు. సినిమా చూడడమే మానేసిన వాళ్లు కూడా ఈ చిత్రాన్ని చూడడానికి రావడం విశేషం.

-వినాయకరావు



Updated Date - 2021-12-12T01:03:25+05:30 IST