‘మురారి’ (Murari): 100 రోజుల వేడుక చేయకపోవడానికి కారణమిదే!

ABN , First Publish Date - 2022-05-20T00:21:09+05:30 IST

సూపర్ స్టార్ (Super Star) మహేశ్ బాబు (Mahesh Babu) కెరీర్‪లో ‘మురారి’ (Murari) చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. హీరోగా ఆయనకు అది నాలుగో చిత్రం. వాటితో పోలిస్తే భారీ బడ్జెట్ పరంగా ముందు

‘మురారి’ (Murari): 100 రోజుల వేడుక చేయకపోవడానికి కారణమిదే!

సూపర్ స్టార్ (Super Star) మహేశ్ బాబు (Mahesh Babu) కెరీర్‪లో ‘మురారి’ (Murari) చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. హీరోగా ఆయనకు అది నాలుగో చిత్రం. వాటితో పోలిస్తే భారీ బడ్జెట్ పరంగా ముందు వరుసలో ‘మురారి’ నిలుస్తుంది. ఆ రోజుల్లోనే ఎనిమిది కోట్ల వ్యయంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. 


ఆ రోజుల్లో  సినిమా విడుదలైన తర్వాత తొలి రెండు వారాల వసూళ్లు చూసి, సక్సెస్‪ను అంచనా వేసేవారు. అయితే ‘మురారి’ చిత్రానికి మొదటి, రెండు వారాలు కలెక్షన్లు డల్‪గా ఉండడంతో ఇది హిట్ సినిమా అని ట్రేడ్ సర్కిల్ గట్టిగా చెప్పలేకపోయింది. అయితే మూడో వారం నుండి పెరిగిన వసూళ్లు ‘మురారి’ని హిట్ చిత్రంగా నిలబెట్టాయి.


హీరో కృష్ణ (Krishna)తో నాయుడుగారి అబ్బాయి, కిరాయి కోటిగాడు, చుట్టాలబ్బాయి, కంచు కాగడా, పరశురాముడు.. వంటి భారీ, సక్సెస్ ఫుల్ చిత్రాలను ఎన్. రామలింగేశ్వరరావు (N Ramalingeswara Rao)  నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణకు నచ్చిన, ఆయన మెచ్చిన నిర్మాత రామలింగేశ్వరరావు. కృష్ణ వీరాభిమానిగా, ఆయన కుమారుడు మహేశ్ బాబుతో ఒక ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించాలన్న రామలింగేశ్వరరావు ఆలోచనకు ఆవిష్కరణగా ‘మురారి’ చిత్రం నిలిచింది. లాభాల కంటే మహేశ్ కెరీర్‪కు హెల్ప్ అయ్యే మంచి హిట్ ఇవ్వాలనే తపనతో నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా ‘మురారి’ చిత్రం నిర్మించారు రామలింగేశ్వరరావు.


ఈ సినిమా హీరోయిన్  విషయంలో కూడా రామలింగేశ్వరరావు, కృష్ణవంశీ(Krishna Vamsi)ల అభిప్రాయాలు కుదరలేదు. కమల్ హాసన్ (Kamal Haasan) ‘హే రామ్’ (Hey Ram) చిత్రంలో నటించిన వసుంధరా దాస్ (Vasundhara Das)‪ను పెడదామని కృష్ణవంశీ అన్నారు. ఆమె రామలింగేశ్వరరావుకు నచ్చలేదు. చివరకు తన కూతురు గోపి సూచించిన సోనాలి బింద్రే(Sonali Bendre) ను ఎంపిక చేశారు. ఈ సినిమాలో మహేశ్‪కు తల్లిగా నటించిన లక్ష్మి(Lakshmi)కి  గోపక్క (Gopakka) అని రామలింగేశ్వరరావు కుమార్తె పేరే పెట్టారు.


ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా భూపతి(Bhupathi)ని పెట్టాలని కృష్ణవంశీ ఆలోచన. అయితే అతన్ని కాదని రాంప్రసాద్ (Ram Prasad)‪ను పెట్టారు రామలింగేశ్వరరావు. కృష్ణ మేకప్ మాన్ మాధవరావు (Madhava Rao) అంటే రామలింగేశ్వరరావుకు అభిమానం. అందుకే మాధవరావు తనయుడు రాంప్రసాద్‪ను ‘కంచు కాగడా’ (kanchu kagada) సినిమాతో ఛాయాగ్రాహకుడు వి.ఎస్.ఆర్. స్వామి (VSR Swamy) దగ్గర అప్రెంటిస్‪గా పెట్టారు. అలాగే ప్రస్తుతం మహేశ్ పర్సనల్ మేకప్ మాన్ పట్టాభి(Pattabhi) కూడా ‘కంచు కాగడా’ చిత్రంతోనే కెరీర్ ప్రారంభించారు.


‘మురారి’ సినిమా సరిగ్గా పరీక్షల సమయంలో విడుదలైంది. పిల్లలు పరీక్షల్లో నిమగ్నమైనా.. కుటుంబ సభ్యులు, పరీక్షలు పూర్తి కాగానే విద్యార్థులు.. ‘మురారి’ సినిమా చూడాలి అనుకొనేలా పబ్లిసిటీ చేశారు రామలింగేశ్వరరావు. తన సినిమాను ప్రమోట్ చేయడానికి అంత డబ్బు ఖర్చు పెట్టిన రామలింగేశ్వరరావు.. ‘మురారి’ వంద రోజుల వేడుక మాత్రం చేయలేదు. దీనికి కారణం దర్శకుడు కృష్ణవంశీతో ఏర్పడిన అభిప్రాయభేదాలే.


మహేశ్‪ను బెస్ట్ పెర్ఫార్మర్‪గా ‘మురారి’ పాత్రలో ప్రొజెక్ట్ చేయడంలో కృష్ణవంశీ సఫలీకృతులయ్యారు. 2001 ఫిబ్రవరి 17న ఈ చిత్రం విడుదలైంది. తొలి రోజున హైదరాబాద్ సంధ్యా 70 ఎంఎం థియేటర్‪లో కృష్ణ, విజయనిర్మల (Vijaya Nirmala), మహేష్  కలిసి ఈ సినిమా చూశారు. సినిమా పూర్తయ్యాక బాగా చేశావని కొడుకు భుజం తట్టి అభినందించారు కృష్ణ.

-వినాయకరావు

Updated Date - 2022-05-20T00:21:09+05:30 IST