Aryan Khan కు బెయిల్ తెప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు.. కోర్టులోనే ఏడ్చేసిన ఈ Pooja ఎవరో తెలుసా..?

ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్‌లో పార్టీ చేసుకుంటూ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల 2వ తేదీన ఆర్యన్ అరెస్ట్ అయ్యాడు. ఆ రోజు నుంచి షారూక్ కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఆర్యన్‌కు బెయిల్ వచ్చేలా చేయడానికి షారూక్, అతని సన్నిహితులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలు మాత్రం సఫలం కావడం లేదు. షారూక్ తరఫున ఓ మహిళ తరచుగా ఎన్‌సీబీ ఆఫీస్‌కు వస్తోంది. 

కోర్టులో విచారణకు హాజరవుతోంది. కోర్టులో ఆర్యన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైనప్పుడు కోర్టు హాల్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఆమె ఎవరా? అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆమె పేరు పూజా దద్లాని. 2012 నుంచి షారూక్ వద్ద మేనేజర్‌గా పనిచేస్తోంది. షారూక్‌కే కాదు.. ఆమె కుటుంబం మొత్తానికి పూజ సన్నిహితురాలని ఆమె సోషల్ మీడియా పోస్టులను బట్టి తెలుస్తోంది.

ఆమె కేవలం షారూక్ సినిమా మేనేజర్ మాత్రమే కాదు.. అతడి బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, షారూక్ ఇతర వ్యాపారాలు, కోల్‌కతా నైట్ రైడర్స్ వ్యవహారాలను కూడా ఆమే పర్యవేక్షిస్తోంది. ఆర్యన్‌తో ఆమెకు చాలా సాన్నిహిత్యం ఉంది. అందుకే ఆమె ఆర్యన్ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 

ఇవి కూడా చదవండిImage Caption

మావాడికి ఫోర్లకంటే సిక్సర్లే ఇష్టం.. యువ ఆల్‌రౌండర్‌ వీడియోపై పంజాబ్ కింగ్స్ పోస్ట్ఈడీ విచారణకు హాజరుకానున్న పూరి జగన్నాథ్యాక్షన్ సీన్ల కోసం ఓ వ్యక్తి నుంచి సలహాలు తీసుకుంటున్న Shah Rukh Khan.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే..

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.