అభిమన్యు, నిఖిల్‌కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కరణ్ అర్జున్’. మోహన్ శ్రీవత్స దర్శకుడు. ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్రబృందం ప్రీ రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘మహాభారతంలోని కర్ణ, అర్జున పాత్రల్లోని భావోద్వేగాలను తీసుకొని ఇప్పటి తరానికి అన్వయిస్తూ రూపొందించిన చిత్రం ఇద’న్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన బాలకృష్ణ మాట్లాడుతూ ‘మా సినిమా బాగా వచ్చింది. గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంద’న్నారు. అసభ్యత, అశ్లీలం లేకుండా తెరకెక్కిన చిత్రం ఇది అని నిఖిల్ కుమార్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరు. సినిమాటోగ్రఫీ: మురళీ కృష్ణ వర్మన్.