సైన్యానికి ఇంద్రాణి సాయం
ABN , First Publish Date - 2022-07-16T05:57:19+05:30 IST
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సూపర్ ఉమన్ మూవీ ‘ఇంద్రాణి’. అక్టోబరు 27న పలు దక్షిణాది భాషల్లో విడుదలవుతోంది...

సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సూపర్ ఉమన్ మూవీ ‘ఇంద్రాణి’. అక్టోబరు 27న పలు దక్షిణాది భాషల్లో విడుదలవుతోంది. యానియా భరద్వాజ్, కబీర్ దుహన్ సింగ్, గరీమా కౌశల్ ప్రధాన తారాగణం. తాజాగా ఈ చిత్రంలో సంజయ్ స్వరూప్, మధు నందన్ కీలకపాత్రల్లో నటించనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత స్టీఫెన్ మాట్లాడుతూ ‘ఐఎ్‌సఎఫ్ అనే సంస్థ కార్యకలాపాల చుట్టూ అల్లుకున్న కథ ‘ఇంద్రాణి’. ఆ సంస్థ ఇండియన్ ఆర్మీకి ఎలా సాయపడింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. భారతీయ సినిమాల్లో ఇప్పటిదాకా రాని కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంద’న్నారు. హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: సాయికిరణ్. సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని.