ఆసక్తికర సంఘటన.. Shah Rukh Khan లగ్జరీ కారు Limousine లో ప్రధాని మోదీ.. వైరల్ అవుతున్న మూడేళ్ల క్రితం నాటి ఘటన..!
ABN , First Publish Date - 2021-10-22T23:05:29+05:30 IST
సాధారణంగా దేశంలోని ఎవరికైనా, ప్రధాని కారులో... తాము కూర్చోవటం, గొప్పగానే ఉంటుంది! కానీ, ఇండియా పీఎం వచ్చి ఓ ప్రైవేట్ వ్యక్తి కారులో స్పెషల్‌గా కూర్చుంటే? సదరు కారు ఓనర్ ఉబ్బితబ్బిబ్బైపోతాడు! అంతేగా...

సాధారణంగా దేశంలోని ఎవరికైనా, ప్రధాని కారులో... తాము కూర్చోవటం, గొప్పగానే ఉంటుంది! కానీ, ఇండియా పీఎం వచ్చి ఓ ప్రైవేట్ వ్యక్తి కారులో స్పెషల్‌గా కూర్చుంటే? సదరు కారు ఓనర్ ఉబ్బితబ్బిబ్బైపోతాడు! అంతేగా...
2018లో షారుఖ్ ఖాన్ ఖరీదైన కారులో నరేంద్ర మోదీ కూర్చున్నారు. పైగా ఓ అంతర్జాతీయ స్థాయి సమావేశానికి అందులోంచి క్రిందకు దిగుతూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు! ఇదంతా జరిగింది దుబాయ్‌లో...
ఓ సారి మనం 2014 దాకా వెనక్కి వెళితే... కింగ్ ఖాన్ షారుఖ్ తన భార్య గౌరీతో కలసి దుబాయ్ వచ్చాడు. ‘రాయల్ ఎస్టేట్స్ బై షారుఖ్ ఖాన్’ అనే రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రారంభోత్సవం కోసం ఆయన తన సరికొత్త లిమోసిన్ కారులోంచి కిందకు దిగాడు. దుబాయ్ రాయల్ ఫ్యామిలీ సభ్యులతో ఇంకా అనేక మంది వీఐపీలు ఎదురొచ్చి స్వాగతం పలికారు! అయితే, అదే లిమోసిన్ కారు... మళ్లీ నాలుగేళ్ల తరువాత... 2018లో వార్తల్లో నిలిచింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కామన్‌వెల్త్ సమ్మిట్‌కి వెళ్లినప్పుడు సేమ్ లగ్జరీ కారులో ప్రయాణించారు. పలువురు దేశాధినేతలు ఆ సమావేశానికి రాగా కేవలం మోదీ మాత్రమే షారుఖ్ ఖరీదు చేసిన లిమోసిన్‌లో హిస్టారికల్ ఎంట్రీ ఇచ్చారు!