Kamal Haasan : ‘ఇండియన్ 2’ కోసం రంగంలోకి...

ABN , First Publish Date - 2022-08-01T16:55:34+05:30 IST

లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan).. ఇటీవల ‘విక్రమ్’ (Vikram) చిత్రంతో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు రూ. 400కోట్ల పైచిలుకు వసూళ్ళను సాధించింది.

Kamal Haasan : ‘ఇండియన్ 2’ కోసం రంగంలోకి...

లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan).. ఇటీవల ‘విక్రమ్’ (Vikram) చిత్రంతో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు రూ. 400కోట్ల పైచిలుకు వసూళ్ళను సాధించింది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సత్తా చాటింది. ఇక తదుపరిగా కమల్‌హాసన్ నటించే చిత్రం గురించి అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది. ‘విక్రమ్’ చిత్రానికి ముందు షూటింగ్ మొదలు పెట్టి.. కొన్ని కారణాల వల్ల పక్కన పెట్టిన ‘ఇండియన్ 2’ (Indian  2) చిత్రాన్ని కమల్ హాసన్ మళ్ళీ మొదలు పెట్టబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే కమల్ ఈ సినిమా ప్రిపరేషన్ వర్క్ కోసం యూఎస్‌లో ల్యాండ్ అవబోతున్నారు. అక్కడ మూడు వారాల పాటు ఆ వర్క్ జరగబోతోంది. సెప్టెంబర్‌లో చిత్రం తిరిగి సెట్స్‌పైకి వెళ్ళబోతున్నట్టు ప్రకటించారు. 


శంకర్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో  సూపర్ హిట్ అయిన ‘ఇండియన్’ (Indian) చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇదే సినిమా తెలుగులో ‘భారతీయుడు’ (Bharateeyudu) పేరుతో విడులైంది. 26 ఏళ్ళ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కడం విశేషంగా మారింది. మొదటి భాగంలో కమల్ హాసన్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అందులో కొడుకు పాత్ర చనిపోతుంది. క్లైమాక్స్‌లో కమల్ హాసన్ పాత్ర బతికే ఉన్నట్టు రివీల్ చేసి.. దీనికి రెండో భాగం ఉంబోతున్నట్టు శంకర్ అప్పుడే హింట్ ఇచ్చారు. ఇంతకాలానికి ఇప్పుడు రెండో భాగం రాబోతుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొంతకాలంగా సరైన సక్సెస్ లేని కమల్ .. విక్రమ్ చిత్రంతో తిరిగి ఫామ్ లోకి రావడంతో.. ‘ఇండియన్ 2’ చిత్రంపై మరింతగా హైపు క్రియేట్ అయింది. 


మొదటి భాగంలో నటించిన వారే రెండో భాగంలోనూ నటించబోతున్నారు. కొన్ని పాత్రలు అదనంగా చేరబోతున్నాయి. అయితే మొదటి భాగంలో సిబిఐ ఆఫీసర్ పాత్ర పోషించిన మలయాళ నటుడు నెడుముడి వేణు చనిపోవడంతో ఆయన స్థానంలో వేరే నటుడ్ని ఎంపిక చేశారు. కాజల్ అగర్వాల్, సుకన్య, సిద్ధార్ధ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ ప్రసాద్, బాబీ సింహ, సముద్రఖని, ఢిల్లీ గణేశ్, వెన్నెల కిషోర్, జార్జ్ మనియన్, మనోబాల, శివాజీ గురవాయూర్, వినోద్ సాగర్, గుల్షన్ గ్రోవర్, దీపా శంకర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో మార్పు ఏంటంటే.. మొదటి భాగానికి అద్భుతమైన సంగీతం అందించిన ఏ.ఆర్.రహమాన్ స్థానంలో అనిరుధ్ రవిచంద్రన్ వచ్చి చేరారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబస్కరన్ అల్లిరాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 



Updated Date - 2022-08-01T16:55:34+05:30 IST